ఆంధ్రాప్యారిస్ @ 115 ఏళ్ల చరిత్ర | 115 years history to andhra parrys | Sakshi
Sakshi News home page

ఆంధ్రాప్యారిస్ @ 115 ఏళ్ల చరిత్ర

Published Wed, Mar 12 2014 12:20 AM | Last Updated on Sat, Aug 18 2018 4:35 PM

ఆంధ్రాప్యారిస్ @ 115 ఏళ్ల చరిత్ర - Sakshi

ఆంధ్రాప్యారిస్ @ 115 ఏళ్ల చరిత్ర

ఆంధ్రాప్యారిస్.. గ్రేడ్ 1 మున్సిపాలిగా గుర్తింపు పొంది జిల్లాకే తలమానికంగా నిలుస్తోంది. జిల్లాలో నాడు స్వాత ంత్య్ర ఉద్యమానికి వేదిక అయిన తెనాలి పట్టణం రాజకీయ చైతన్యానికీ పెట్టింది పేరు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న మహామహులు ఇక్కడ పురపాలన చేశారు. న్యాయవాదులు, వైద్యులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. 115 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పట్టణంలో నేటి ఓటర్లు మరోమారు తమ ప్రతినిధులను ఎన్నుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.          - తెనాలిరూరల్, న్యూస్‌లైన్
 
 ఆంధ్రాప్యారిస్‌గా పిలుచుకునే తెనాలి పట్టణం ఏర్పడి 115 ఏళ్లు అయింది. పట్టణంగా ఆవిర్భవించక మునుపు ప్రాచీన తెనాలికి పశ్చివు హద్దు నేటి రావులింగేశ్వరాలయుం. తూర్పున నేడున్న గ్రావుకచేరి చావడి, దక్షిణాన మెరుున్‌రోడ్డు, ఉత్తరాన అరుుతానగర్ రజక చెరువు హద్దులుగా ఉన్నారుు. ఇవే గ్రావుకంఠం హద్దులు. వీటి లోపలి ప్రాచీన గ్రావుమే ఒకనాటి తెనాలి. గ్రావూనికి తూర్పు ఈశాన్య ప్రాంతంలో శివారాధకులు, జంగాలు ఉపయోగించే శ్మశానభూమి, పశ్చివుంగా శివాలయూనికి ఎదురుగా గ్రావు శ్మశానం, దక్షిణంగా నేడున్న పాత ఏరియూ ఆస్పతి స్థలంలో అప్పట్లో గొల్లపాలెంగా పిలుచుకునే ప్రాంతం ఉండేది. పట్టణ అభివృద్ధి అంతా  20వ శతాబ్దంలో జరిగినదే.  


 స్వాతంత్య్రానంతరం..
 దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత వుున్సిపాలిటీకి 1949లో జరిగిన ఎన్నికల్లో సహకారోద్యవు ప్రవుుఖుడు నన్నపనేని వెంకట్రావు చైర్మన్‌గా ఎన్నికయ్యూరు. వీరు 1949, 1952, 1956లో వుూడు పర్యాయూలు చైర్మన్‌గా ఎన్నికయ్యూరు. వుధ్యలో ఒక ఏడాది 1955-56లో హ్యూవునిస్టు, న్యాయువాది ఆవుల గోపాలకృష్ణవుూర్తి చైర్మన్‌గా పనిచేశారు. కాంగ్రెస్ ప్రవుుఖుడు ఆలపాటి వెంకట్రావుయ్యు 1959లో చైర్మన్‌గా ఎన్నికయ్యూరు. శాసనసభ ఎన్నికల్లో పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొంది వుున్సిపాలిటీ వుంత్రిగా నియుమితులు కావటంతో 1962లో రాజీనావూ చేశారు. 1962-64లో తవ్వా శ్రీరావుులు, 1967-72 బండ్ల పుల్లయ్యు చైర్మన్లుగా చేశారు. 1981-82లో అన్నాబత్తుని సత్యనారాయుణ, తర్వాత డాక్టర్ రావి రవీంద్రనాథ్ (1982-86, 1987-1992), ఆలవుూరి విజయులక్ష్మీకువూరి (1995-2000), యుడ్ల గంగాధరరావు (2000-2005) చైర్మన్‌గా పనిచేశారు. 2005 ఎన్నికల్లో డాక్టర్ తాడిబోరుున వుస్తానవ్ము చైర్మన్‌గా ఎన్నిక కాగా, 2009లో దొడ్డక సీతామహాలక్ష్మిని చైర్మన్‌గా ఎన్నుకున్నారు.
 
 ఎమ్మెల్యేలుగా వుున్సిపల్  చైర్మన్లు...
 తెనాలి వుున్సిపాలిటీకి చైర్మన్లుగా పనిచేసినవారిలో నలుగురు ఎమ్మెల్యేలుగా శాసనసభలో తెనాలికి ప్రాతినిధ్యం వహించారు. ఆలపాటి వెంకట్రావుయ్యు వుూడు పర్యాయూలు వరుసగా గెలుపొందగా,  నన్నపనేని వెంకట్రావు పొన్నూరు నుంచి శాసనసభకు ఎన్నికయ్యూరు. టీడీపీ ఆవిర్భావంతో అన్నాబత్తుని సత్యనారాయుణ ఆ పార్టీ తర ఫున తొలి ఎన్నికల్లో పోటీచేసి రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యూరు. ఆ తర్వాత డాక్టర్ రావి రవీంద్రనాథ్ 1994 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తెనాలి నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. ఈ నలుగురిలో ఆలపాటి వెంకట్రావుయ్యు, అన్నాబత్తుని సత్యనారాయుణను వుంత్రి పదవులను వరించారుు. తొలి వుహిళా చైర్మన్‌గా ఎన్నికైన ఘనత ఆలవుూరి విజయులక్ష్మీకువూరి విజయాన్ని దక్కించుకున్నారు. వుున్సిపల్ ఎన్నికల్లో ఓసీ జనరల్ కేటగిరీలో ఎవరైనా పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ వూజీ వుుఖ్యవుంత్రి, తెనాలి వూజీ ఎమ్మెల్యే నాదెండ్ల భాస్కరరావు 1995 ఎన్నికల్లో ఆలవుూరిని అభ్యర్థిగా ఎంపికచేసి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేరుుంచారు. ఆ ఎన్నికల్లో గెలిచిన ఆలవుూరి తొలి వుహిళ వుున్సిపల్ చైర్మన్‌గా అయ్యూరు. 2005 ఎన్నికల్లో వుున్సిపల్ చైర్మన్ పదవి బీసీ వుహిళలకు దక్కటంతో పట్టణానికి చెందిన వైద్యురాలు డాక్టర్ తాడిబోరుున వుస్తానవ్ముకు అవకాశం దక్కింది. తొలి బీసీ వుహిళా చైర్‌పర్సన్‌గా డాక్టర్ వుస్తానవ్ము గుర్తింపు పొందారు.
 
 పట్టణాభివృద్ధి
 ఆలపాటి వెంకట్రామయ్య హయాంలో వేగం పుంజుకున్న పట్టణాభివృద్ది, అన్నాబత్తుని సత్యనారాయణ, రావి రవీంద్రనాథ్, ఆలమూరి విజయలక్ష్మికుమారి, యడ్ల గంగాధరరావు, డాక్టర్ తాడిబోయిన మస్తానమ్మ, దొడ్డక సీతామహాలక్ష్మి పరిపాలన కాలంలో కొనసాగింది. ప్రస్తుతం పురపాలక సంఘ ఆస్థుల విలువ సుమారు రూ.450 కోట్లకుపైగానే ఉంది.  
 
 పురపాలనలో మహామహులు..

 1909లో ప్రారంభంలో వుున్సిపల్ చైర్మన్లను నామినేట్ చేశారు. వుున్సిపాలిటీ తొలి చైర్మన్‌గా పి.నాగేశ్వరరావు పంతులు (1910-12) పనిచేశారు. తర్వాత పి.కావురాజు పంతులు (1912), సి.భక్తవత్సలం నాయుర్ (1913-16) చైర్మన్‌గా ఉన్నారు. తెనాలి వుున్సిపాలిటీకి 1920 నుంచి జరిగిన ఎన్నికల్లో న్యాయువాదులు, సంఘ సంస్కరణవాదులు ఎన్నికవుతూ వచ్చారు. తొలి ఎన్నికల్లో న్యాయువాది చెమిటిగంటి వెంకట సుబ్రహ్మణ్యశాస్త్రి (1920-21)ఎన్నికయ్యూరు. తర్వాత పండిత పిల్లలవుర్రి ఆంజనేయు పంతులు (1921-25), భావవిప్లవ కవి ‘కవిరాజు’ త్రిపురనేని రావుస్వామి (1925-31, 1934-38), స్వాతంత్రయోధుడు రావి సత్యనారాయుణ (1938-43, 1948-49), వుుస్లిం స్వాతంత్య్రయోధుడు జనాబ్ షేక్ అబ్దుల్ వహాబ్ (1942-44), కన్నెగంటి వీరయ్యు (1944-45), న్యాయువాది వేదాంతం లక్ష్మీనారాయుణ (1946-47) చైర్మన్లుగా పనిచేశారు.
 
 తెనాలి పట్టణ స్వరూపం
 జనాభా        : 1,64,939
 విస్తీర్ణం        : 15.11 చ.కి.మీ
 ఓటర్లు        : 1,28,234
 పురుషులు    : 62,446
 స్త్రీలు        : 65,771
 ఇతరులు    : 17
 వార్డులు    : 40
 చైర్మన్ పదవి    : జనరల్
 
 రిజర్వుడు..
 మహిళలు    : 10
 జనరల్        : 9
 బీసీ        : 7
 బీసీ మహిళ    : 6
 ఎస్సీ మహిళ    : 3
 ఎస్సీ        : 3
 ఎస్టీ మహిళ    : 1
 ఎస్టీ        : 1
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement