ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం | 7 years old girl raped | Sakshi
Sakshi News home page

ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం

Published Sat, Dec 26 2015 4:19 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

7 years old girl raped

తగరపువలస (విశాఖపట్నం) : ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని చాక్లెట్‌లు ఇప్పిస్తానని తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన విశాఖ జిల్లా తగరపువలసలోని చిట్టివలస కొండపేటలో శనివారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న లారీ డ్రైవర్ కె.శ్రీనివాస్(25) ఇంటి పక్కన ఆడుకుంటున్న చిన్నారిని చాక్లెట్లు ఇప్పిస్తానంటూ తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలిక కేకలు వేసింది. ఇది గమనించిన స్థానికులు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement