ఎస్ఈ నివాసంపై ఏసీబీ దాడి | acb raids at apewidc se K.Bhaskar rao | Sakshi
Sakshi News home page

ఎస్ఈ నివాసంపై ఏసీబీ దాడి

Published Wed, Jun 29 2016 12:25 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

acb raids at apewidc se K.Bhaskar rao

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఎస్ఈగా విధులు నిర్వహిస్తున్న కె.భాస్కరరావు నివాసంపై బుధవారం ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడి చేశారు.

అలాగే ఆయన బంధువుల ఇళ్లపై కూడా ఏసీబీ అధికారులు ఏక కాలంలో దాడి చేశారు. ఈ తనిఖీల్లో భారీగా నగదు ఏసీబీ అధికారులకు లభించినట్లు సమాచారం. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement