బోలెరో బోల్తా..ఒకరు మృతి | bollero vehicle turtled kills one | Sakshi
Sakshi News home page

బోలెరో బోల్తా..ఒకరు మృతి

Published Wed, May 6 2015 8:13 AM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM

bollero vehicle turtled kills one

నెల్లూరు(దక్కిలి): దక్కిలి మండలం వెలికల్లు వద్ద బుధవారం ఉదయం 2 గంటలకు బోలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాసరి వెంకటేశ్వర్లు(35) అనే వ్యక్తి అక్కడిక్కడే మరణించాడు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వెంకటేశ్వర్లు ప్రమాద సమయంలో బోలెరో వాహనాన్ని నడుపుతున్నాడు. కుటుంబసభ్యులతో కలిసి చెంచలకోనలో ఉన్న లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి బయలుదేరగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

వెంకటేశ్వర్లు స్వగ్రామం పెల్లకూరు మండలం పెంబేరు. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement