ప్రకాశం బ్యారేజీ
హైదరాబాద్: సాక్షి టీవీలో 'ప్రమాదం అంచున విజయవాడ' అని ప్రకాశం బ్యారేజీకి పొంచి ఉన్న ముప్పు పై ప్రసారం చేసిన కథనానికి కృష్ణాడెల్టా చీఫ్ ఇంజనీర్ స్పందించారు. కృష్ణా నదిపై విజయవాడలో నిర్మించిన ప్రకాశం బ్యారేజీకి ప్రాణంగా భావించే 70 క్రస్ట్ గేట్లు తుప్పు పట్టాయి. ఈ అంశంపై బ్యారేజీ నిర్వహణ కమిటీ ఈరోజు నివేదిక ఇస్తుందని చీఫ్ ఇంజనీర్ తెలిపారు.
బ్యారేజీ 70 గేట్లను మరమ్మతు చేయిస్తామని ఆయన చెప్పారు. నిపుణుల సిఫారసు మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.