ధవళేశ్వరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు సజీ వదహనం అయ్యారు. షార్ట్ సర్క్యూట్ లేదా ఏదైనా ప్రమాదం వల్లే పూరిగుడిసెలో మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక దళ అధికారులు చెబుతున్నారు. కూలిపని చేసుకునే మార్తమ్మ (45), ఆమె ఇద్దరు కుమార్తెలు, వసంత, శ్రీలక్ష్మి, ఇద్దరు మనవరాళ్లు మరణించారు. సుమంత్ అనే చిన్న పిల్లవాడిని మాత్రం స్థానికులు రక్షించారు. అతడు షాక్కు గురైనట్లు తెలుస్తోంది. ప్రమాద విషయం తెలిసి చుట్టుపక్కల వాళ్లు స్పందించేలోగానే మంటలు విస్తరించాయి. కనీసం పోస్టుమార్టం చేయడానికి కూడా మృతదేహాలు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఒకరినొకరు చేతులు పట్టుకుని మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. కుమార్తెల్లో వసంత తన భర్తతో గొడవ పడి పది రోజుల క్రితమే పుట్టింటికి వచ్చినట్లు చుట్టుపక్కల వారు చెబుతున్నారు.
వేసవి కాలం మొదలుకావడంతో పూరిగుడిసెల్లో ఉండేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని అగ్నిమాపక దళ అధికారులు సూచించారు. చిన్న నిప్పురవ్వ తగిలినా వెంటనే మంటలు చెలరేగే ప్రమాదం ఉందని, అందువల్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరారు.
అగ్నిప్రమాదంలో ఐదుగురు మహిళల సజీవదహనం
Published Tue, Mar 11 2014 7:52 AM | Last Updated on Thu, Apr 4 2019 5:20 PM
Advertisement