అమ్మవారి సేవలో గవర్నర్ దంపతులు
తిరుచానూరు: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని ఆదివారం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్.నరసింహన్ దంపతు లు దర్శించుకున్నారు. గవర్నర్‌కు ఆలయం ఎదుట జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, టీటీడీ తిరుపతి జేఈ వో పోలా భాస్కర్, ఆలయ ఏఈ వో నాగరత్న, సూపరింటెండెంట్ వరప్రసాద్, ప్రసాదాల ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
తొలుత అమ్మవారి ధ్వజస్తంభాన్ని దర్శిం చుకున్న గవర్నర్ దంపతులు అనంతరం కుంకుమార్చన సేవలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆశీర్వాద మండపంలో గవర్నర్ దంపతులకు జేఈవో పోలాభాస్క ర్ అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. గవర్నర్ మీడియా తో మాట్లాడుతూ ఇరు రాష్ట్ర తెలు గు ప్రజలు శాంతి, సౌభ్రాతృత్వం, సుఖసంతోషాలతో ఉండాలని అ మ్మవారిని ప్రార్థించినట్లు తెలిపా రు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం శుభపరిణామమన్నారు. ప్రతి ఒకరూ యోగా సాధనతో ఆరోగ్యంగా జీవించాలని పిలుపునిచ్చారు.
గవర్నర్‌కు సాదర స్వాగతం
తిరుమల: తిరుచానూరు అమ్మవారి దర్శనానంతరం గవర్నర్ దం పతులు తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథిగృ హం వద్ద గవర్నర్‌కు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు స్వాగతం పలికారు.
ఆకర్షించిన శునకం..
పద్మావతి అతిథిగృహానికి చేరుకున్న గవర్నర్ నరసిం హన్‌కు భద్రతా సిబ్బందితో ఉన్న శునకం తన పద్ధతిలో స్వాగతం పలికింది. గవర్నర్ శునకాన్ని చూస్తూ నిలబడ్డారు. ‘సీ దా డాగ్’ అంటూ పక్కవారికి చూపారు.