వైద్య ఉద్యోగులు సమష్టిగా పనిచేయాలి | Medical staff to work jointly | Sakshi
Sakshi News home page

వైద్య ఉద్యోగులు సమష్టిగా పనిచేయాలి

Published Wed, Jan 21 2015 2:19 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

వైద్య ఉద్యోగులు సమష్టిగా పనిచేయాలి - Sakshi

వైద్య ఉద్యోగులు సమష్టిగా పనిచేయాలి

ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు బాలాజీనాయుడు
 
రిమ్స్ (కడప అర్బన్) : ప్రభుత్వ వైద్య శాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న వైద్య ఉద్యోగులందరూ సమష్టిగా పనిచేయాలని ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీనాయుడు తెలిపారు. మంగళవారం కడప రిమ్స్‌లోని ఐపీ విభాగం కాన్ఫరెన్స్ హాలులో ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా సదస్సు నిర్వహించారు.  బాలాజీనాయుడు మాట్లాడుతూ  ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘమన్నారు.

వైద్య ఆరోగ్యశాఖలో వార్డు సిబ్బంది మొదలుకొని ల్యాబ్ టెక్నిషియన్స్, రేడియోగ్రాఫర్స్, ఫార్మసిస్ట్‌లు, నర్సింగ్ సిబ్బందికి పదోన్నతి అవకాశాలు, సంవత్సరానికి 35 రోజుల సాధారణ సెలవులు, వారాంతపు డే ఆఫ్‌లు, యూనిఫాం అలవెన్స్‌లతోపాటు అన్ని డిమాండ్లను సాధించామన్నారు. అన్ని పీఆర్‌సీలలోనూ మెరుగైన వేతనాలు, సాధారణ బదిలీలలో కౌన్సెలింగ్ విధానం సాధించామన్నారు.

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్‌కు అన్ని వేళలా సహకరిస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మణమూర్తి, ఏఐటీయూసీ మాజీ అధ్యక్షుడు డబ్ల్యు రాము, కడప రిమ్స్ బ్యాచ్ అధ్యక్షుడు జీవయ్య, జిల్లా కన్వీనర్ కంభం చిన్నయ్య, ఏఐటీయూసీ నాయకుడు బాదుల్లా, నాయకులు నరహరి, స్టాఫ్ నర్సులు, వైద్య ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement