పంచాయతీలకు సొంత గూడు | own office to panchayathis | Sakshi
Sakshi News home page

పంచాయతీలకు సొంత గూడు

Published Tue, Feb 25 2014 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 4:03 AM

own office to panchayathis

95 పంచాయతీలకు ఆర్‌జీపీఎస్‌ఏ నిధులు మంజూరు
  5 వేల జనాభా దాటితే రూ.13.50 లక్షలు
  5 వేలలోపు జనాభా ఉంటే రూ.12 లక్షలు
 
 ఏలూరు, న్యూస్‌లైన్ : పరాయి పంచన.. అద్దె భవనాలు.. బడి, గుడుల్లో నడుస్తున్న పంచాయతీ కార్యాలయాలకు సొంతగూళ్లు సమకూరనున్నారుు. జిల్లాలో 158 పంచాయతీ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. వీటిలో 95 పంచాయతీలకు గూడు సమకూర్చేందుకు కలెక్టర్ సిద్ధార్థజైన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కొత్తగా అమల్లోకి వచ్చిన రాజీవ్‌గాంధీ పంచాయతీ స్వశక్తికరణ్ అభియాన్ (ఆర్‌జీపీఎస్‌ఏ) పథకం కింద భవనాలు నిర్మించదలిచారు. 5వేలకు మించి జనాభా గల పంచాయతీలకు రూ.13.50 లక్షల చొప్పున, 5వేల జనాభా ఉండే పంచాయతీ లకు రూ.12 లక్షల చొప్పున విడుదల చేస్తూ ప్రభుత్వం పరిపాలనా ఆమోదం లభించింది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో వీటి నిర్మాణాలు చేపట్టనున్నట్టు జిల్లా పంచాయతీ అధికారి అల్లూరి నాగరాజు వర్మ తెలిపారు.
 
 పర్యవేక్షణకు ఆదేశాలు
 పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణాలను ఈవోపీఆర్డీ, సర్పంచ్, కార్యదర్శులు, ఎంపీడీవోలు పర్యవేక్షించి వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదే శించారు. మిగిలిన 63 పంచాయతీలకు త్వరలోనే నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది.
 
 ఈ గ్రామాలకు..
 జిల్లాలో అత్యధికంగా లింగపాలెం మండలంలో 13 పంచాయతీలకు భవనాలు సమకూరనున్నాయి. ద్వారకాతిరుమల మండలంలో 10 పంచాయతీలకు కార్యాలయూలు నిర్మించనున్నారు. భీమవరం మం డలం దిరుసుమర్రు, కాళ్ల మండలం పెదఅమిరం, నల్లజర్ల మండలం పోతవరం, నిడదవోలు మండ లం తాడిమళ్ల, పాలకొల్లు మండలం లంకలకోడేరు, తాళ్లపూడి మండలం అన్నదేవరపేట, ఉండి మండ లం చెరుకువాడ, వీరవాసరం పంచాయతీలకు రూ.13.50 లక్షల చొప్పున వెచ్చించి పంచాయతీ కార్యాలయూలు నిర్మిస్తారు. ఆకివీడు మండలం చినకాపవరం, చినమిల్లిపాడు, భీమవరం మండలం దెయ్యాలతిప్ప, కోమటితిప్ప నార్త్, నాగిడిపాలెం, పెదగరువు, యనమదుర్రు, చాగల్లు మండలం గౌరీ పల్లి, నందిగంపాడు, దెందులూరు మండలం మేది నరావుపాలెం, పెరుగ్గూడెం, ద్వారకాతిరుమల మం డలం సీహెచ్ పోతేపల్లి, జి.కొత్తపల్లి, గుండుగొలనుకుంట, జాజులకుంట, కోడిగూడెం, కొమ్మర, మద్దులగూడెం, రాళ్లకుంట, రామన్నగూడెం, తిమ్మాపు రం, యలమంచిలి మండలం అడవిపాలెం, బాడవ, కాజ వెస్ట్, లక్ష్మీపాలెం, మట్లపాలెం, నేరేడుమిల్లి, శిరగాలపల్లి, ఏలూరు మండలం కాట్లంపూడి, గణపవరం మండలం సీహెచ్ అగ్రహారం, ముగ్గుళ్ల, వీరేశ్వరపురం, కరగపాడు, వేళ్లచింతలగూడెం, కాళ్ల మండలం జక్కరం, ఎల్‌వీఎన్ పురం, కామవరపుకోట మండలం ఆడమిల్లి, తూర్పు యడవల్లి, కొవ్వూరు మండలం పెనకనమెట్ట, తోగుమ్మి, కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం గ్రామాల్లో పంచాయతీ కార్యాలయూల నిర్మాణానికి నిధులు మంజూరయ్యూయి.
 
 లింగపాలెం మండలం ఆశన్నగూడెం, అయ్యపరాజుగూడెం, బాదరాల, బోగోలు, కలరాయనగూడెం, కొత్తపల్లి, లింగపాలెం, మఠంగూడెం, ములగలంపాడు, నరసన్నపాలెం, రంగాపురం, టీసీహెచ్‌ఆర్ పాలెం, యడవల్లి, మొగల్తూరు మండలం ముత్యాలపల్లి, వారతిప్ప, నల్లజర్ల మండలం జగన్నాథపురం, పశ్చిమ చోడవరం, నరసాపురం మండలం కె.నవరసపురం, పసలదీవి, మర్రితిప్ప, రాజుగారితోట, వైఎస్ పాలెం, పాలకోడేరు మండలం కోరుకొల్లు, పెదపాడు మండలం గోగుంట, జయపురం, పెదవేగి మండలం జానంపేట, కె.కన్నాపురం, నడుపల్లి, పోడూరు మండలం కొమ్ముచిక్కాల, తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెం, కొత్తూరు, కుంచనపల్లి, ఎల్.అగ్రహారం, మారంపల్లి, నందమూరు, నీలాద్రిపురం, పుల్లాయగూడెం, వెంకట్రావుపాలెం, ఉండి మండలం అర్తమూరు, ఉంగుటూరు మండలం ఎ.గోకవరం, అప్పారావుపేట, కంసాలిగుంట, తిమ్మయ్యపాలెం, వీఏ పురం, వీరవాసరం మండలం దూసనపూడి గ్రామాలకు పంచాయతీ కార్యాలయూలు సమకూరనున్నాయి. వీటిలో ఒక్కొక్క పంచాయతీకి రూ.12 లక్షల చొప్పున కేటాయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement