
'చిరంజీవి స్థానాన్ని ఆక్రమించిన పవన్ కళ్యాణ్'
హైదరాబాద్: ప్రజలలోనూ, అభిమానులలోనూ చిరంజీవి స్థానాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆక్రమించారని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. అయితే పవన్ రాజకీయ అభిప్రాయాలు ఏమిటో తనకు తెలియదన్నారు.
సమైక్య ఉద్యమానికి తూట్లు పొడిచేలా కేంద్ర మంత్రులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అందుకే ప్రజలు వారిని టార్గెట్ చేస్తున్నారన్నారు. విభజన అంశంపై కేంద్రమంత్రుల ప్రకటనలు గందరగోళానికి దారి తీస్తున్నాయని చెప్పారు. విభజన అంశంపై, తీర్మానం, బిల్లు వంటి అంశాలలో అధిష్టానం పెద్దలే మాటలు మార్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎక్కువ పార్లమెంట్ సీట్లు గెలుస్తామనే ఆశతోనే హైకమాండ్ విభజన నిర్ణయం తీసుకుందన్నారు.
తెలంగాణపై బీజేపీ పునరాలోచనపడినందున 2014లోపు విభజన జరగే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయలలో సమీకరణలు మారతాయ మంత్రి గంటా అన్నారు.