హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై ఆ రాష్ట్ర మండలిలో సీపీఐ సభ్యుడు పీజే చంద్రశేఖర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం ఏపీ శాసనమండలిలో రాష్ట్రంలో కాయిలా పడిన పరిశ్రమల పునరుద్ధరణ అంశంపై సభలో జరిగిన చర్చ సందర్భంగా పీజే సుధాకర్ మాట్లాడుతూ.... ప్రభుత్వానికి కానీ సీఎం చంద్రబాబుకు కానీ ఏదైనా అంశంలో ప్రతిపక్షాలతో మాట్లాడటం, ఇతరులెవరైనా చెప్పేది వినే అలవాటు లేదని ఎద్దేవా చేశారు.
పోని చెప్పేది విని ఆలోచిస్తామని కూడా అనడానికి వారు సిద్ధంగా లేరని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలతో మాట్లాడితే తామెక్కడ తక్కువ అవుతామోనన్న ఓ విధమైన సంకుచిత మనస్తత్వం, దుగ్ధ ప్రభుత్వానికి ఉందని ఆయన విరుచుకుపడ్డారు. దీని వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందన్నారు.