=బోగీల శుభ్రత, నిర్వహణ అంతా ప్రైవేటు వారి చేతుల్లో
=300 మందికి గాను 56 మందే ట్రైన్ లైటింగ్ సిబ్బంది
=ఒక్క ఏసీ బోగీకీ అటెండెంట్ లేరు
తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: ‘కలియుగ ప్రత్యక్ష దైవ కృపాకటాక్షాల వల్లో..ఏమో మరి తిరుపతి రైల్వే డిపో పరిధిలో ఎలాంటి భారీ ప్రమాదాలు సంభవించడం లేదు. కానీ మన రైలు బండ్లు ఎంత వరకు భద్రం అన్న అంశంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి’ అని కార్మిక సంఘాలు, రైల్వే ప్రయాణికుల సలహా కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయినా వీరి గోడు పట్టించుకునే లేకుండా పోయారు. తిరుపతి రైల్వే డిపో పరిధిలో రోజుకు 60 రైళ్ల నిర్వహణ చేపడుతున్నారు.
అందులో రైలు బోగీల శుభ్రత, లైటింగ్ రిపేర్లు, పర్యవేక్షణ, ఇంజినీరింగ్ విభాగం ద్వారా గ్రీసింగ్, బోగీల బోల్టుల ఫిటింగ్ తదితర పనులన్నీ చూడ్డానికి సీఅండ్‌డబ్ల్యూ, మెకానిక్ విభాగాలున్నాయి. వీటిలో బోగీల శుభ్రత నుంచి ఏసీ బోగీల్లో బెడ్‌రోల్ ఏర్పాటు వరకు అన్ని కార్యక్రమాలనూ ప్రైవేటు ఏజెన్సీకి మూడేళ్ల క్రితమే అప్పగించేశారు. ఇప్పుడు రైలు బోగీల శుభ్రత, లైటింగ్, వైరింగ్ పనుల పరిశీలన కోసం ఆ ప్రైవేటు ఏజెన్సీ వారు నియమించుకున్న సిబ్బందిలో 80 శాతం మంది బీహార్, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ తదితర రాష్ట్రాలకు చెందిన వారు ఉండడం గమనార్హం.
ప్రైవేటు ఏజెన్సీపై, వారి పరిధిలోని కార్మికులపై అజమాయిషీ చేసేందుకు స్థానిక అధికారులెవరైనా సాహసిస్తే వారికి బదిలీ వేటు తప్పదు. అంతేగాక ఏజెన్సీ కార్మికులకు నెలకు రూ.3 వేల జీతం ఇస్తున్నారు. రోజుకో వ్యక్తిని విధుల్లోకి తీసుకోవడం వల్ల కూడా రైలు బోగీల శుభ్రత, భద్రత అంశాలు డొల్లగా మారా యి. బోగీల్లో ఫ్యాన్లు, లైటింగ్ వైర్లు, ఇతరత్రా ఎలక్ట్రికల్ పనులను యార్డు లైన్లలో తని ఖీచేసి సరిచేసేందుకు ట్రైన్ లైటింగ్ సిబ్బంది ఉం టారు. తిరుపతి పరిధిలో 300 మందికి గాను కేవలం 56 మంది మా త్రమే పనిచేస్తున్నారు.
ఏసీ బోగీల్లో కనపడని అటెండెంట్లు
ఒక్కో ఏసీ బోగీకి ఏసీ అటెండెంట్ ఉండాలన్నది రైల్వే నిబంధన. తిరుపతి పరిధిలో నుంచి నిర్వహణ ముగిం చుకుని వెళ్లే రైళ్లలో ఒక్క అటెండెంట్ లేరు. ఈ అటెం డెంట్ ఏసీ బోగీలోని ప్రయాణికులు దిగాల్సిన చోట, ఎక్కే చోట వేకప్‌కాల్ ఇవ్వడం, హాల్ట్ స్టేషన్ రాగానే డోర్లు తెరవడం చేయాలి. ఏసీ బోగీల్లోని ప్రయాణికులకు అవసరమైన బెడ్‌షీట్లు, బెర్త్‌ల కవర్లు బెడ్‌రోల్ సిబ్బంది ఏర్పాటు చేయాలి. గతంలో ఈ పనులన్నీ రైల్వేశాఖకు చెందిన ఉద్యోగులే చేసేవారు. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు చేస్తున్నారు. వారు నిత్యం ప్రయాణికుల పట్ల గొడవలు పడడానికే సమయం సరిపోతోంది. అందులో భాగంగానే ఇటీవల నాందేడ్, కొల్హాపూర్ ప్రాంతాల్లో ఇద్దరు రైల్వే పోలీస్ సిబ్బందిని రైలు లో నుంచి తోసేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి.
ప్రైవేటు వ్యక్తుల నిర్వహణ మానుకోవాలి
రైళ్లలోని ప్రయాణికుల భద్రతతో ముడిపడి ఉన్న అంశాల్లో ప్రైవేటు వ్యక్తుల నిర్వహణను పూర్తిగా మానుకోవాలి. ముఖ్యంగా బోగీల శుభ్రత, లైటింగ్ పనుల్లో రైల్వే సిబ్బందినే నియమిస్తే ప్రమాదాలు జరగవు.
- కే.కళాధర్, డివిజనల్ కార్యదర్శి, రైల్వే మజ్దూర్ యూనియన్
ప్రమాద కారణాలకు చెక్ పెట్టాలి
రైళ్లలో ప్రమాదాలకు కారణమైన అంశాలకు చెక్ పెట్టేలా అధికారుల చర్యలు చేపట్టాలి. బయటి రాష్ట్రాల వ్యక్తులకు రైళ్ల నిర్వహణా బాధ్యతలు అప్పగించరాదు. రైల్వే నిబంధనలు పాటించాలి. ఖాళీలను భర్తీ చేయాలి.
-సుదర్శనరాజు, బ్రాంచి సెక్రటరీ, తిరుపతి
రైలు బండికి భద్రతేదీ?
Published Sun, Dec 29 2013 4:24 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 AM
Advertisement