ఐసీడబ్ల్యూఏ ఫలితాల్లో తెలుగు తేజాల సత్తా
⇒ ఇంటర్, ఫైనల్ పలితాల్లో సూపర్ విజ్ ఆలిండియా ఫస్ట్
⇒ ఇంటర్‌లో కృష్ణా జిల్లాకు చెందిన లక్ష్మీప్రసన్న, ఫైనల్‌లో చిత్తూరు జిల్లాకు చెందిన నాగోలు మోహన్‌కుమార్ ఫస్ట్
లబ్బీపేట (విజయవాడ తూర్పు): కోల్‌కతాలోని ఐసీడబ్ల్యూఏ (సీఎంఏ) చాప్టర్ శుక్రవారం ప్రక టించిన ఫలితాల్లో విజయవాడ లోని సూపర్‌విజ్ విద్యార్థులు ఐసీడబ్ల్యూఏ ఫైనల్, ఇంటర్‌లలో ఆలిండియా ఫస్ట్ ర్యాంకులు సొంతం చేసుకున్నారు. వీటితో పాటు మరిన్ని ర్యాంకులను తమ విద్యార్థులు సొంతం చేసుకున్నట్లు సూపర్‌విజ్ ప్రిన్సిపాల్ సబ్బినేని వెంకటేశ్వరరావు శుక్రవారం ప్రకటించారు. ఐసీడబ్ల్యూఏ ఫైనల్‌లో చిత్తూరు జిల్లా చోడవరానికి చెందిన నాగోలు మోహన్‌కుమార్ ఆలిండియా ఫస్ట్ ర్యాంకు, రామసముద్రానికి చెందిన లతాశ్రీ మూడో ర్యాంకు, విజయవాడకు చెందిన సాయి మహిత 18వ ర్యాంకు, విశాఖపట్నానికి చెందిన జి.మహేశ్ 44వ ర్యాంకు సాధించారని తెలిపారు.
ఐసీడబ్ల్యూఏ ఐంటర్‌లో కృష్ణా జిల్లా పోటుమీద గ్రామానికి చెందిన జె.లక్ష్మీప్రసన్న ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించగా, గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన పరిశ లక్ష్మి 2వ ర్యాంకు, ద్వారకా తిరుమలకు చెందిన బండారు వెంకట దుర్గాప్రసాద్ 3వ ర్యాంకు, కృష్ణా జిల్లాకు చెందిన నూతలపాటి వంశీకృష్ణ 5వ ర్యాంకు, వైఎస్సార్ జిల్లాకు చెందిన చిన్నబోయిన రెడ్డియ్య 31వ ర్యాంకు, తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన పి.శివకుమార్ 28వ ర్యాంకు సాధిం చినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఇప్పటి వరకు 52 సార్లు ఆలిండియా ఫస్ట్ ర్యాంకులు సా«ధించి రికార్డును సొంతం చేసుకున్నామన్నారు. విద్యార్థుల పట్టుదల, అధ్యాపకుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందన్నారు.