అసౌకర్యాల నిలయం
అనంతపురం మెడికల్:
మౌలిక సౌకర్యాల కల్పనలో సర్వజన ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్నానాల గదులు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు లేకపోవడం సమస్యాత్మకంగా మారింది. ఆస్పత్రి మొత్తం మీద 33 బాత్‌రూంలకు మరమ్మతులు చేయాల్సి ఉందని అధికారులే చెబుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆస్పత్రిలోని ఆర్థో, లేబర్, ఎఫ్‌ఎస్, ఎంఎస్ ఇలా చాలా వార్డుల్లో టాయిలెట్లు, బాత్‌రూంలు పాడయ్యాయి. ముఖ్యంగా ఆర్థో వార్డులో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆర్థో ఫిమేల్ మెడిసిన్(ఎఫ్‌ఎం) వార్డులోని రెండు యూనిట్లలో టాయిలెట్లకు తాళం వేయడంతో ఈ వార్డుల్లో ఇన్‌పేషంట్లుగా ఉన్న వారు కనీస అవసరాలను తీర్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
మేల్ మెడిసిన్ (ఎంఎం) వార్డులోనూ ఇదే పరిస్థితి. ఇక్కడి ఒక యూనిట్‌లోని గదిలో ఒక టాయ్‌లెట్ పూర్తిగా పనిచేయడం లేదు. మరో టాయ్‌లెట్‌లో టైల్స్, బేసిన్ పగిలిపోయాయి. ఎంఎం వార్డులోని మరో యూనిట్‌లో టాయ్‌లెట్ పనిచేయడం లేదు. ఈ రెండు విభాగాల్లోనూ బాత్‌రూంల పరిస్థితి దయనీయంగా ఉంది. వాటి నుంచి నీరు బయటికి వెళ్లకపోవడం అసౌకర్యంగా మారింది. లేబర్ వార్డుతో పాటు మరికొన్ని వార్డుల్లో ఫ్యాన్లు చాలా వరకు పనిచేయడం లేదు. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పన, మరమ్మతులపై మంగళవారం ఇక్కడికి విచ్చేస్తున్న ఏపీఎంఎస్‌ఐడీసీ మేనేజింగ్ డెరైక్టర్ రవిచంద్ర ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మెడిసిన్ (ఎంఎం) వార్డులోనూ ఇదే పరిస్థితి. ఇక్కడి ఒక యూనిట్‌లోని గదిలో ఒక టాయ్‌లెట్ పూర్తిగా పనిచేయడం లేదు. మరో టాయ్‌లెట్‌లో టైల్స్, బేసిన్ పగిలిపోయాయి. ఎంఎం వార్డులోని మరో యూనిట్‌లో టాయ్‌లెట్ పనిచేయడం లేదు. ఈ రెండు విభాగాల్లోనూ బాత్‌రూంల పరిస్థితి దయనీయంగా ఉంది. వాటి నుంచి నీరు బయటికి వెళ్లకపోవడం అసౌకర్యంగా మారింది. లేబర్ వార్డుతో పాటు మరికొన్ని వార్డుల్లో ఫ్యాన్లు చాలా వరకు పనిచేయడం లేదు. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పన, మరమ్మతులపై మంగళవారం ఇక్కడికి విచ్చేస్తున్న ఏపీఎంఎస్‌ఐడీసీ మేనేజింగ్ డెరైక్టర్ రవిచంద్ర ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.