'ఆ సర్వేలతో లగడపాటికి సంబంధం లేదట' | vallabhaneni Bala Souri takes on TDP | Sakshi
Sakshi News home page

'ఆ సర్వేలతో లగడపాటికి సంబంధం లేదట'

Published Fri, Mar 14 2014 2:08 PM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM

'ఆ సర్వేలతో లగడపాటికి సంబంధం లేదట' - Sakshi

'ఆ సర్వేలతో లగడపాటికి సంబంధం లేదట'

గుంటూరు : రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతినిధులుగా ఓటు అడిగే హక్కు తమకే ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని బాలశౌరి అన్నారు. రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చిన టీడీపీకి ఎన్నికల్లో ఓటు వేయమని అడిగే హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. విభజనకు సహకరించిన చంద్రబాబు నాయుడు కుట్రను ఊరూరా ప్రచారం చేస్తామని బాలశౌరి తెలిపారు.

సర్వేల పేరుతో టీడీపీ ప్రజలను మోసం చేస్తోందని ఆయన అన్నారు. సర్వేలతో తనకు సంబంధం లేదని లగడపాటి రాజగోపాల్ తనతో చెప్పారని బాలశౌరి పేర్కొన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటమే వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. కాగా ఇటీవల లగడపాటి రాజగోపాల్ నిర్వహించిన సర్వేల్లో టీడీపీ ముందంజలో ఉన్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement