బాబూ..3కేఆర్ రుణాల మాటేంటి? | What about me? .. 3 kear loans? | Sakshi
Sakshi News home page

బాబూ..3కేఆర్ రుణాల మాటేంటి?

Published Mon, Jun 16 2014 4:02 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

బాబూ..3కేఆర్ రుణాల మాటేంటి? - Sakshi

బాబూ..3కేఆర్ రుణాల మాటేంటి?

  • ఇజ్రాయిల్ సేద్యం ఘోరంగా విఫలం                     
  •  తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలు
  •  రుణమాఫీ కోసం పలు మార్లు ఆందోళనలు              
  •  నేడు చంద్రబాబును కలవనున్న రైతులు
  • కుప్పం: కుప్పం రైతుల జీవితాల్లో మార్పు తీసుకువస్తామంటూ నారా చంద్రబాబు నాయుడు తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ ర్భాటంగా ఇజ్రాయిల్ సేద్యాన్ని ప్రారంభిం చారు. ఇది ఘోరంగా విఫలం అయింది. ఇజ్రాయిల్ టెక్నాలజీ ద్వారా సేద్యం చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. 3 కేఆర్ పేరుతో బ్యాంకులు ద్వారా తీసుకున్న రుణాలను చెల్లిం చలేకపోయారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హ యాంలో చేసిన రుణాలు మాఫీలో చాలా మంది రైతులు లబ్ధిపొందారు.

    ఇంకా 600 మంది రైతులు రుణాలు చె ల్లించాల్సి ఉంది. ఇప్పటికీ వందలాది మంది రైతులకు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తూనే ఉన్నాయి. రుణాల రద్దు కోసం రైతులు పలుమార్లు ఆందోళనలు చేసినా పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడైనా రుణాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
     
    చంద్రబాబు తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యాక కుప్పంలో ఇజ్రాయిల్ సేద్యాన్ని ప్రా రంభించారు. 1998లో జపాన్ నుంచి జీకా సంస్థ ప్రతినిధులు కుప్పానికి వచ్చారు. వారు వచ్చి ఇక్కడ పరిస్థితులను పరిశీలించి వెళ్లారు. 1999వ సంవత్సరంలో 2కేఆర్ (2 కెనడీ రౌం డ్) పేరుతో ఇజ్రాయిల్ సేద్యాన్ని ప్రారంభిం చారు. దాదాపు 1600 ఎకరాల్లో ప్రారంభిం చా రు. వంద శాతం సబ్సిడీతో రైతులకు రుణాలు ఇచ్చి డ్రిప్ పరికరాలను అందజేశారు.

    అవి నాణ్యమైన పైపులు కావడంతో మంచి ఫలి తాలు వచ్చాయి. ఆ తర్వాత 2001 సంవత్సరంలో 3 కేఆర్ పేరుతో రైతులకు 50 శాతం సబ్సిడీతో రుణాలు ఇచ్చి సుమారు 7300 ఎకరాల్లో దాదాపు 2600 మంది రైతులు ఇజ్రాయిల్ సేద్యాన్ని చేపట్టారు. 3 కేఆర్ ద్వారా రుణాలు పొందిన రైతులకు పలు కంపెనీలు నాణ్యతలేని డ్రిప్ పైపులను సరఫరా చేశాయి. అంతేకాకుండా మార్కెట్ రేటు కంటే రూ.7950 అదనంగా వసూలు చేశారు. దీంతో రైతులపై రూ. 5.18 కోట్లు భారం పడింది.

    ఐదు సంవత్సరా వారెంటీతో పైపులను సరఫరా చేశారు. ఒక్క సంవత్సరం కూడా పనిచేయలేదు. పంట సరిగా రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులకు సాంకేతికంగా సలహాలు,సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన బ్రెట్ హసితా కన్సల్‌టెన్సీ కంపెనీ కూడా రైతులను పట్టించుకోలేదు. మొక్కుబడిగా సేవలను అందించింది. ఇజ్రాయిల్ సేద్యం ద్వారా పండించిన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కూడా బీహెచ్‌సీ కంపెనీనే కల్పించాలి.

    అది కూడా చేయలేదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా అప్పటి చంద్రబాబు ఆ కంపెనీ ప్రతినిధులకు మేలుచేసేలా వ్యవహరించారు. ఏడాదికి రూ. 2.8 కోట్లు ఫీజును చెల్లించారు. అధికారం నుంచి దిగిపోయే చివరి రోజూ కూడా రూ 1.5 కోట్లు చెల్లించారు. నష్టపోయిన రైతులను పట్టించుకోలేదు. రైతులు కూడా బ్యాంకులకు రుణాలను చెల్లించలేదు. ఇప్పటికీ వారికి బ్యాంకుల నుంచి నోటీసులు వస్తూనే ఉన్నాయి.
     
    అధికారంలోకి వస్తే 3 కేఆర్ రుణాలు మాఫీ చేస్తా..చంద్రబాబు

    మీరు నన్ను ఆదరించారు..వునకు వుంచి రోజులు వస్తాయి...నేను సీఎం కాగానే త్రీకేఆర్ రణాలను వూఫీ చేస్తా...ఇది చంద్రబాబు ప్రతిపక్ష నేతగా 2012 జనవరిలో గుడిపల్లి వుండలం తల్లి అగ్రహారం గ్రావుంలో జరిగిన సభలో రైతులకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ యన సీఎం అయ్యారు. అప్పటి హామీని అమ లు చేస్తారో..లేదా అని రైతులు ఎదురుచూస్తున్నారు. 3 కేఆర్ కింద మొతం 7362 ఎకరాల్లో ఇజ్రాయిల్ సేద్యాన్ని చేశారు.

    కుప్పంలో 2106 ఎకరాలు, శాంతిపురంలో 328 ఎకరాలు, రామకుప్పంలో 1309 ఎకరాలు, వి.కోటలో 1801 ఎకరాల్లో సేద్యాన్ని చేశారు. సుమారు 2600 మంది 3 కేఆర్ రుణాలను తీసుకుని సేద్యాన్ని చేసి నష్టపోయారు. దీంతో రైతులు రుణాలను చెల్లించలేదు. ఈ రుణాలను రద్దు చేయాలని ప లు మార్లు ఆందోళన కూడా చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అమ లు చేసిన రుణమాఫీలో చాలా మంది రైతుల రుణాలు మాఫీ అయ్యాయి. ఇంకా  663 వుంది రైతులు రూ. 6 కోట్ల 34 లక్షల 40 వేలు చెల్లిం చాల్సి ఉంది.

    కుప్పం వుండలంలో 303 వుంది రూ. 2 కోట్ల79 లక్షలు,శాంతిపురం వుండలం 251 వుంది రూ. కోటి 48 లక్షలు, గుడుపల్లి మండలంలో 15 వుందికి రూ. 10 లక్షలు, రావుకుప్పం వుండలంలో 126 వుంది రైతులు రూ. కోటి 64 లక్షలు, వి.కోట మండలంలో 18 వుంది రైతులు రూ. 30 లక్షలు బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది. ఇజ్రాయిల్ సేద్యం వల్ల తీవ్రనష్టం వాటిల్లిందని, ఆర్థికంగా ఎంతో నష్టపోయామని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.

    ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రుణమాఫీలపై అధ్యయనం చేసేం దుకు వేసిన కమిటీ 3 కేఆర్ రుణాలను పట్టిం చుకుంటుందా, అసలు రుణాలు మాఫీ అవుతాయా అని రైతులు ఆందోళన చెందుతున్నా రు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం కుప్పం నియోజకవర్గాన్ని వస్తున్న చంద్రబాబు నాయుడిని కలసి 3 కేఆర్ రుణాలు మాఫీ చేయాలని రైతులు కోరనున్నట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement