న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి మోసపూరితంగా రూ. 2,600 కోట్ల మేర రుణాలు తీసుకున్న కేసులో మీడియా సంస్థ పిక్సియన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు చెందిన రూ. 127.74 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెల్లడించింది. వీటిలో 11 కమర్షియల్ ప్లాట్లతో పాటు ముంబై, చెన్నై, నోయిడా, కోల్‌కతాల్లో గ్రూప్ కంపెనీల భవంతులు కూడా ఉన్నట్లు పేర్కొంది. పిక్సియన్ మీడియా, పెర్ల్ మీడియా, మహువా మీడియా, పిక్సియన్ విజన్, పెర్ల్ స్టూడియో, పెర్ల్ విజన్, సెంచరీ కమ్యూనికేషన్, పిక్సియన్ గ్రూప్ సంస్థల డైరెక్టర్లు పీకే తివారీ, ఆనంద్ తివారీ, అభిõÙక్ తివారీ తదితరుల ఆస్తులు వీటిలో ఉన్నాయి. వీరు వివిధ బ్యాంకుల నుంచి మోసపూరితంగా రూ. 2,600 కోట్ల మేర రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తీసుకున్న రుణాలను దారి మళ్లించిన డైరెక్టర్లు.. వివిధ ప్రాంతాల్లో ఆస్తులను కొనుగోలు చేసినట్లు ఈడీ పేర్కొంది. ఇప్పటికే సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లు, చార్జిïÙట్ల ప్రాతిపదికన మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద గ్రూప్, దాని ప్రమోటర్లపై కేసు నమోదు చేసినట్లు ఈడీ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment