కోవె వెంచర్తో ఐ-లెండ్ జట్టు
• బిగ్ డేటా ఆధారంగా రుణ గ్రహీతల చెల్లింపులు, ప్రవర్తనల విశ్లేషణ
• ఏడాదిలో 2 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ
• ఐ-లెండ్ ఫౌండర్ శంకర్ వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పీర్ 2 పీర్ (పీ2పీ) లేదా ప్రత్యామ్నాయ ఆర్థిక సేవలను అందిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఐ-లెండ్.. బిగ్ డేటా సొల్యూషన్ సేవలందిస్తున్న యూకేకు చెందిన కోవె వెంచర్‌తో జట్టు కట్టింది. ఈ ఒప్పందంతో ఐ- లెండ్‌లో రుణాలు తీసుకునే వారు, గ్రహీతల వివరాలు, వారి చెల్లింపులు, సామాజిక మాధ్యమాల్లో వారి ప్రవర్తన వంటి అన్ని అంశాలను బిగ్ డేటా ద్వారా విశ్లేషించే వీలుంటుందని ఐ-లెండ్ ఫౌండర్ వి. శంకర్ చెప్పారు.
కోవె వెంచర్ ఫౌండర్ అండ్ సీఈఓ మాధవా తిరుమలతో కలిసి బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటివరకు ఐ-లెండ్ ద్వారా రూ.2.4 కోట్ల రుణాలను ఇప్పించామని, 0.3 శాతం మాత్రమే డిఫాల్ట్‌ర్స్ ఉన్నారని చెప్పారు. ప్రతి రుణ లావాదేవీలపైన రుణ దాత నుంచి 1 శాతం, గ్రహీత 3 శాతం చార్జీ చేస్తామన్నారు. నుంచి ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై నగరాల్లో సేవలందిస్తున్నామని.. మరో 45 రోజుల్లో బెంగళూరు, పుణె నగరాలకు విస్తరించనున్నామని పేర్కొన్నారు. 2017 ముగింపులోగా 2 మిలియన్ డాలర్ల నిధులు సమీకరిస్తామని తెలిపారు.