- లిస్టెడ్ కంపెనీలకు సెబీ ఆదేశాలు
- గడువు ఈ నెల 31 వరకే
ముంబై: మహిళా డెరైక్టర్ల విషయమై స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఒత్తిడి పెంచుతోంది. ఈ నెల చివరి కల్లా డెరైక్టర్ల బోర్డ్‌లో కనీసం ఒక మహిళనైనా నియమించుకోవాలని లిస్టెడ్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
లిస్టైన కంపెనీల్లో అగ్రశ్రేణి 500 కంపెనీల్లో కనీసం మూడో వంతు కంపెనీల్లో మహిళా డెరైక్టర్లు లేరని గుర్తించిన సెబీ ఈ విషయమై 160కు పైగా కంపెనీలకు లేఖలు రాసింది. గడువులోగా మహిళా డెరైక్టర్ల నియామకం కోసం తగిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే కొన్ని కంపెనీలు సెబీకి ప్రత్యుత్తరాలు రాశాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్టాక్ మార్కెట్లో లిస్టైన కంపెనీలు ఏప్రిల్ 1లోగా కనీసం ఒక మహిళనైనా డెరైక్టర్‌గా నియమించుకునేలా చూడాలని కంపెనీ వ్యవహారాల శాఖకు కూడా సెబీ లేఖలు రాసింది.
గత ఏడాది అక్టోబర్ నాటికే మహిళా డెరైక్టర్లను నియమించాలని సెబీ ఆదేశించింది. ఆ తర్వాత ఈ గడువును మరో 6 నెలలు పొడిగించింది. ఇది కూడా ముగియనుం డటంతో మహిళా డెరైక్లర్లను నియమించని కంపెనీలపై తీవ్ర చర్యలు తప్పకపోవచ్చని భావిస్తున్నారు.
మహిళా డెరైక్టర్లను నియమించండి..
Published Mon, Mar 16 2015 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 10:54 PM
Advertisement
Advertisement