హైదరాబాద్: దేశీ సెల్‌ఫోన్ కంపెనీ ‘సెల్‌కాన్’ సీఎండీ వై.గురు టీవీ5 బిజినెస్ లీడర్స్ అవార్డును సొంతం చేసుకున్నారు. భారత్‌లో తయారీ విభాగం కింద ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమైన మేకిన్ ఇండియాను ముందుకు తీసుకెళ్లే వ్యాపారవేత్తలను గౌరవించేందుకు ఈ విభాగాన్ని కేటాయించారు.
కాగా, ఈ అవార్డు అందుకోవడం పట్ల వై.గురు సంతోషం వ్యక్తం చేశారు. 2009లో చిన్న బ్రాండ్‌గా సెల్‌కాన్ మొదలై నేడు దేశంలోనే ప్రముఖ బ్రాండ్‌గా అవతరించడం పట్ల సంతోషాన్ని ప్రకటించారు. సెల్‌కాన్‌ను విశేషంగా ఆదరించిన కస్టమర్లకు ఈ అవార్డును అంకితం చేస్టున్నట్టు ప్రకటించారు. చిత్రంలో మహారాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకుం టున్న సెల్‌కాన్ సీఎండీ వై.గురు, పక్కనే ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాద్, మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment