
చిత్తూరు అర్బన్: చిత్తూరు రూరల్ మండల ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సీఐ ఎస్.బషీర్ అహ్మద్ (57) శుక్రవారం మృతి చెందారు. 2015 సెప్టెంబరు నుంచి చిత్తూరు రూరల్ సీఐగా పనిచేస్తున్న ఈయన మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు.
మధ్యాహ్నం చిత్తూరులోని తన నివాసంలో ఉండగా కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. శనివారం తిరుపతిలోని మహతి ఆడిటోరియం మసీదు వద్ద అంత్యక్రియలు జరుగుతాయని బషీర్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈయన మృతిపట్ల ఎక్సైజ్ అధికారులు ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు.