
సత్యనారాయణ
కుషాయిగూడ: బాలికలకు చాక్లెట్లు ఆశచూపి లైంగిక దాడులకు పాల్పడుతున్న వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు.రాచకొండ షీటీమ్స్ ఇన్‌చార్జి సలీమా, ఏసీపీ కృష్ణమూర్తితో కలిసి కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. రాచకొండ షీటీమ్స్ ఆధ్వర్యంలో కాప్రా ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినుల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయగా పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థినులు, వారి తల్లిదండ్రుల నుంచి తమకు ఆరు ఫిర్యాదు అందినట్లు తెలిపారు. వాటిపై విచారణ చేపట్టగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు.
పాఠశాల సమీపంలో ఉంటున్న రిటై ర్డ్ రైల్వే ఉద్యోగి సత్యనారాయణ(88) అనే వృద్ధుడు అటువైపుగా వచ్చిన విద్యార్థినులకు చాక్లెట్లు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని డబ్బులు కూడా ఇచ్చేవాడని బాధితులు తెలిపారన్నారు. గత ఆరు నెలలుగా ఆరుగురు విద్యార్థినులపై లైంగికదాడులకు పాల్పడినట్లు విచారణలో తేలిందని, బాధితుల్లో నలుగురు ఎస్సీలు ఉన్నట్లు పేర్కొన్నారు.
నిందితుడిపై పీడీ యాక్ట్..
నిందితుడు సత్యనారాయణపై వివిధ సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసీటీ కేసు, పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు ఆమె వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment