
సంఘటనాస్థలంలో మృతదేహాలు( అంతర్ చిత్రంలో పాత చిత్రాలు)
అనంతపురం జిల్లా : విద్యుత్ తీగలు తగిలి మంగళవారం ఇద్దరు వ్యక్తులు మరణించారు. పుట్లూరు మండలం అరకటివేములలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి వద్ద గాలివాన తో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తుండగా అప్పటికే తెగిపడ్డ విద్యుత్ తీగలు తగిలి ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు అప్రమత్తమై రక్షించేలోపే ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరి శరీరాలు కరెంటు ప్రసరణ ధాటికి పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనతో మృతుల కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా పిడుగు పాటుకు నల్లమాడ మండలంలో ఇద్దరు, చిలమత్తూరు మండలంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. అకాలవర్షాలకు తాడిపత్రి, పుట్టపర్తి, శింగనమల నియోజకవర్గాల్లో పండ్లతోటలు దెబ్బతిన్నాయి. అక్కడక్కడా విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి.