* 20వ తేదీ వరకూ సర్టిఫికెట్ల పరిశీలన
* జిల్లాలో రెండు హెల్ప్‌లైన్ కేంద్రాల ఏర్పాటు
* ఆదాయ ధ్రువీకరణ చూపితేనే ఫీజ - రీయింబర్స్‌మెంట్
గుంటూరు ఎడ్యుకేషన్ : పాలిటెక్నిక్ విద్యార్హతతో బీటెక్ ద్వితీయ సంవత్సరంలోకి నేరుగా ప్రవేశం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ-సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 16వ తేదీన ప్రారంభం కానుంది. ఇందు కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి జిల్లాలో రెండు హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
హెల్స్‌లైన్ కేంద్రాలివే..
గుంటూరు నగర పరిధిలో గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకూ ర్యాంకుల వారీగా విద్యార్థులసర్టిఫికెట్లను పరిశీలిస్తారు. పరిశీలన అనంతరం కళాశాలల ఎంపికకై ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవే రోజుల్లో వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది.
ప్రాసెసింగ్ ఫీజులు ఇవీ..
సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో ప్రాసెసింగ్ ఫీజు రూపంలో ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.500 చెల్లించాలి. ఎస్టీ విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు గుజ్జనగుండ్లలోని పాలిటెక్నిక్‌లో హాజరు కావాలి. వివరాలకు https://apece-t.-nic.in వెబ్‌సైట్ సందర్శించాలి.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హతలివీ..
ఫీజు రీ యింబర్స్‌మెంట్ పొందాలంటేఆదాయధ్రువీకరణపత్రాన్ని విధి గాతీసుకెళ్లాలి. కుటుంబ వార్షికాదాయం రూ.లక్ష లోపు ,ఓసీ, బీసీలు, రూ.2 లక్షలకు మించని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు.
విద్యార్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఆయా సర్టిఫికెట్ల రెండు సెట్ల జిరాక్స్ కాపీలను వెంట తీసుకెళ్లాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించిన తరువాత ఒక సెట్ జిరాక్స్ కాపీలను తీసుకుని ఒరిజినల్ ధ్రువపత్రాలను ఇచ్చేస్తారు. సీటు అలాట్‌మెంట్ తరువాతఒరిజినల్ సర్టిఫికెట్లను సంబం దిత కళాశాలలో అందజేయాలి.
ప్రత్యేక విభాగాలకు విజయవాడలో..
దివ్యాంగులు, క్యాప్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, గేమ్స్, ఆంగ్లో ఇండియన్ విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 16,17 తేదీల్లో విజయవాడ బెంజ్ సర్కిల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో హాజరవ్వాలి.
తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాలు
ఈ-సెట్-2016 ర్యాంకు కార్డు, హాల్ టిక్కెట్, డిప్లొమా, పాలిటెక్నిక్ రెండేళ్ల మార్కుల జాబితాలు, ప్రొవిజినల్ డిప్లొమా సర్టిఫికెట్, జనన ధ్రువీకరణ పత్రం, 4వ తరగతి నుంచి డిప్లొమా వరకు స్టడీ సర్టిఫికెట్, టెన్త్ లేదా తత్సమాన అర్హత పరీక్ష మెమో, రెసిడెన్స్ సర్టిఫికెట్ సమర్పించాలి. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ తరువాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, దివ్యాంగులు, ఇతర కేటగిరీలకు చెందిన వారు సంబంధిత ధ్రువపత్రాలను చూపాలి.
ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల పరిశీలన తేదీలు
గుజ్జనగుండ్లలో కళాశాలలో...
ఈనెల 16న ఒకటో ర్యాంకు నుంచి 3,500 ర్యాంకు వరకూ, 17న 7,001 ర్యాంకు నుంచి 10,500 వరకూ, 18న 14,001 నుంచి 17,500 వరకూ, 19న 21,001 ర్యాంకు నుంచి 24,500 వరకూ, 20న 28,001 ర్యాంకు నుంచి 32 వేలు వరకూ హాజరుకావాలి.
నల్లపాడులో కళాశాలలో...
ఈనెల 16న 3,501 ర్యాంకు నుంచి 7,000 ర్యాంకు వరకూ, 17న 10,501 ర్యాంకు నుంచి 14,000 వరకూ, 18న 17,501 నుంచి 21,000 వరకూ, 19న 24,501ర్యాంకునుంచి 28 వేలు వరకూ, 20న 32,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకూ విద్యార్థులు హాజరు కావాలి.
రేపటి నుంచి ఈ-సెట్ కౌన్సెలింగ్ -2
Published Wed, Jun 15 2016 9:53 AM | Last Updated on Thu, Sep 27 2018 4:31 PM
Advertisement