ఐక్యతతోనే ఈడిగల అభివృద్ధి | Ediga's development of unity | Sakshi
Sakshi News home page

ఐక్యతతోనే ఈడిగల అభివృద్ధి

Published Mon, Jun 19 2017 12:43 AM | Last Updated on Tue, Sep 5 2017 1:56 PM

ఐక్యతతోనే ఈడిగల అభివృద్ధి

ఐక్యతతోనే ఈడిగల అభివృద్ధి

రాష్ట్ర అధ్యక్షుడు కొనకోళ్ల నారాయణ
 
అనంతపురం రూరల్‌:  ఐక్యతతోనే ఈడిగల అభివృద్ధి సాధ్యం అవుతుందని ఈడిగ, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొనకోళ్ల నారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక కేఎస్‌ఆర్‌ బాలికల పాఠశాలలో జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌గౌడ్‌ అధ్యక్షతన గౌడ విద్యార్థుల ప్రతిభా ఆవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన ఈడిగలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కులవృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న ఈడిగలు తమ పిల్లలను విద్యవైపు అడుగులు వేయించాలన్నారు.  గీతకార్మికుల కార్పొరేషన్‌ చైర్మన్‌ తాతా జయప్రకాష్‌ నారాయణన్‌ మాట్లాడుతూ విదేశీ చదువులు కోసం కార్పొరేషన్‌ ద్వారా గీత కార్మికుల పిల్లలకు రుణాలను అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఇంటర్, 10వ తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ ఫోన్లతోపాటు నగదు పురస్కారాలు, జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ చమన్, ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌, గౌడ సంఘం నాయకులు రాజు, సుధాకర్, బీసీ ఐక్యవేదిక నాయకులు ఆంజనేయులుగౌడ్, వెంకటరమణ, విజయ్‌కుమార్, హరిప్రతాప్, వెంకటేష్‌గౌడ్, జిల్లా నాయకులు కూడేరు జయప్రకాష్‌గౌడ్, శ్రీహరి, లక్ష్మీకాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement