ఉత్సాహంగా గిరకబండిలాగుడు పోటీలు | girakabandi competetions in gulyapalyam | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా గిరకబండిలాగుడు పోటీలు

Published Fri, Apr 7 2017 11:30 PM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM

ఉత్సాహంగా గిరకబండిలాగుడు పోటీలు

ఉత్సాహంగా గిరకబండిలాగుడు పోటీలు

గూళ్యపాళ్యం (వజ్రకరూరు) : మండలంలోని గూళ్యపాళ్యంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని గ్రామస్తుల ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన గిరకబండి లాగుడు పోటీలు ఉత్సాహంగా సాగాయి. పోటీల్లో ఎనిమిది జతల ఎద్దులు పాల్గొన్నాయి. గ్రామానికి చెందిన మామిడికాయల లాలుస్వామి ఎద్దులు మొదటి స్థానంలో, మామిడికాయల కిష్టయ్య ఎ ద్దులు రెండవస్థానంలో నిలిచాయి. శాంతమ్మగారి రామాంజనేయులు ఎద్దులు మూడో స్థానంలో నిలిచాయి. మొదటి బహుమతి 10 తులాల వెండి, రెండో బహుమతి 8 తులాల వెండి, మూడో బహుమతి 6 తులాల వెండిని ఎస్‌ఐ జనార్దన్‌నాయుడు అందచేశారు.

Advertisement
Advertisement