నిమజ్జనంలో గాయపడ్డ వ్యక్తి మృతి | Immersed in the death of the person injured | Sakshi
Sakshi News home page

నిమజ్జనంలో గాయపడ్డ వ్యక్తి మృతి

Published Fri, Sep 9 2016 7:09 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM

నిమజ్జనంలో గాయపడ్డ వ్యక్తి మృతి

నిమజ్జనంలో గాయపడ్డ వ్యక్తి మృతి

ప్రొద్దుటూరు క్రైం: వినాయకుడి నిమజ్జనానికి వెళ్లి ప్రమాదవ శాత్తు ట్రాక్టర్‌పై నుంచి కింద పడి గాయపడిన కొలిబోయిన వీరయ్య(40) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సీతంపల్లె పంచాయతీ పరిధిలోని ఎర్రగుంటపల్లెకు చెందిన వీరయ్య రైతు కూలి పని చేసుకుని జీవనం సాగించే వాడు. ఆయనకు భార్య నర్సమ్మతోపాటు శ్రావణి, స్రవంతి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాన్ని గురువారం నిమజ్జనం చేయడానికి చాపాడు సమీపంలోని కుందూ వంతెన వద్దకు వెళ్లారు. నిమజ్జనం అనంతరం గ్రామస్తులందరూ ఇంటికి ట్రాక్టర్‌లో బయలుదేరే సమయంలో వీరయ్య ఆ వాహనాన్ని ఎక్కుతూ ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. తీవ్రంగా గాయ పడిన అతన్ని సాయంత్రం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకొని వచ్చారు. పరిశీలించిన వైద్యుడు మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు వెళ్లాలని సూచించారు. అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా కర్నూలు సమీపంలోకి వెళ్లగానే మృతి చెందాడు. చాపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement