బస్సుల కోసం ధర్నా
బస్సుల కోసం ధర్నా
Published Fri, Aug 5 2016 6:17 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
భూదాన్‌పోచంపల్లి : పాఠశాల సమయానికి బస్సులు నడపాలని కోరుతూ శుక్రవారం మండలంలోని మెహర్‌నగర్‌కు చెందిన విద్యార్థులు జలాల్‌పురం స్టేజీ వద్ద ధర్నా నిర్వహించి బస్సులను అడ్డుకున్నారు. గ్రామానికి వచ్చే ఒక బస్సు సైతం సమయానికి రాకపోవడంతో 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఈ విషయమై పలు మార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో రెవెల్లి శ్రీను, కోట రమేశ్, చెక్క శ్రీనివాస్, కోట చంద్రశేఖర్, విద్యార్థులు భాను, అరుణ్‌ప్రసాద్, చంద్రశేఖర్, వంశీ, రాధిక, హరిత, మౌనిక, స్వీటీ, దివ్య, వైష్టవి, శరత్, నానీ, కృష్ణప్రసాద్, మధు, ప్రశాంత్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement