దంపతులను ఆశీర్వదిస్తున్న ఎమ్మెల్యే కనకారెడ్డి
శామీర్‌పేట్: మనస్పర్థలతో విడిపోయి వేర్వేరుగా ఉంటున్న దంపతులను ఇరవై ఏళ్ల తరువాత ఒక్కటి చేశాడు వారి కుమారుడు. వెంకన్న సాక్షిగా తల్లిదండ్రుల కు మళ్లీ పెళ్లి జరిపించాడు. ఆదివారం రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం శ్రీ క్షేత్రగిరి వేంకటేశ్వరస్వామి గుట్టపై జరిగిన ఈ సంఘటన వివరాలు...
శామీర్‌పేట్‌కు చెందిన బండి సతీశ్వర్‌రెడ్డి, సంగీతలకు 1986లో వివాహమైంది. వీరికి కుమారుడు సంతన్‌రెడ్డి ఉన్నాడు. కుటుంబకలహాలు, మనస్పర్థలతో వీరు 1996లో విడిపోయారు. తల్లివద్దే ఉంటున్న కుమారుడు అమెరికాలోని ఫ్లోరిడా లో స్థిరపడ్డాడు. ఎంత సంపాదించినా తల్లిదండ్రులు వేర్వేరుగా ఉండడం అత డ్ని కలిచివేసింది. వారిద్దరినీ ఎలాగైనా కలపాలని ఇటీవల స్వదేశానికి వచ్చాడు. తల్లిదండ్రులతో మాట్లాడి వారిని ఒక్కటి చేశాడు. అంతేకాకుండా ఆదివారం వెంకటేశ్వరాలయంలో వారికి మళ్లీ పెళ్లి జరిపించాడు. మల్కాజిగిరి ఎమ్మెల్యే కనకారెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు ఉద్దమర్రి నర్సింహారెడ్డి హాజరయ్యారు.