స్వ(ర్ణ)చ్ఛభారత్‌ లోగో | swa(ran)chha bharat logo | Sakshi
Sakshi News home page

స్వ(ర్ణ)చ్ఛభారత్‌ లోగో

Published Sun, Oct 2 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM

స్వ(ర్ణ)చ్ఛభారత్‌ లోగో

స్వ(ర్ణ)చ్ఛభారత్‌ లోగో

గణపవరం (నిడమర్రు) : మహాత్మాగాంధీ స్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమానికి ప్రతీక అయిన లోగోను ఓ స్వర్ణకళాకారుడు బంగారంతో రూపొందించాడు. గణపవరానికి చెందిన స్వర్ణకారుడు పేరూరి వేణుగోపాల కృష్ణ  0.050 మిల్లీ గ్రాముల బంగారంతో గాంధీజీ కళ్లజోడును రూపొందించాడు. ఆదివారం గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ లోగో తయారు చేశానని, దీని తయారీకి అరగంట సమయం పట్టిందని చెప్పారు. కళ్లజోడు ప్రేమ్‌లో అద్దాలు బిగించడానికే ఎక్కువ సయం తీసుకుందన్నారు. గత ఏడాది ఇదే కళాకారుడు 500 మిల్లీ గ్రాముల బంగారంతో రాట్నం తయారు చేశారు. 
 
 

Advertisement
Advertisement