ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్ కోర్సులు | Travel & Tourism Management Courses | Sakshi
Sakshi News home page

ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్ కోర్సులు

Published Thu, Apr 2 2015 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 11:42 PM

Travel & Tourism Management Courses

ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్ కోర్సు అందించే సంస్థల వివరాలు, ఉద్యోగావకాశాల గురించి వివరించండి?    -రష్మిత, సింగరేణి
 కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు:
 హైదరాబాద్‌లోని డా.వై.ఎస్.రాజశేఖరరెడ్డి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్.. టూరిజం అండ్ హాస్పిటాలిటీలో ఎంబీఏని ఆఫర్ చేస్తోంది.    అర్హత: డిగ్రీ
 ప్రవేశం: క్యాట్/ మ్యాట్/ ఎక్స్‌ఏటీ/ ఐసెట్‌లలో ఉత్తీర్ణతతో పాటు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
 వెబ్‌సైట్: www.nithm.ac.in
 కొచ్చిన్‌లోని స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (సీయూఎస్‌ఏటీ).. ట్రావెల్ అండ్ టూరిజంలో ఎంబీఏని ఆఫర్ చేస్తోంది.
 అర్హత: 50 శాతం మార్కులతో డిగ్రీ.
 ప్రవేశం: సీయూఎస్‌ఏటీ నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్)లో ఉత్తీర్ణత ఆధారంగా
 వెబ్‌సైట్: www.cusat.nic.in
 గ్వాలియర్ అండ్ భువనేశ్వర్‌లోని ఐండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెం ట్.. టూరిజం అండ్ ట్రావెల్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తోంది.
 అర్హత: డిగ్రీ
 ప్రవేశం: క్యాట్/ఎక్స్‌ఏటీ/ఏటీఎంఏ/జీమ్యాట్/మ్యాట్ స్కోర్ ఆధారంగా.
 వెబ్‌సైట్: www.iittm.org
 ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ దూరవిద్య ద్వారా టూరిజం మేనేజ్‌మెంట్‌లో ఎంఏ కోర్సును అందిస్తోంది.
 అర్హత: బీటీఎస్/బీహెచ్‌ఎం/బీఏ(టూరిజం)/డిగ్రీతో టూరిజంలో డిప్లొమా
 వెబ్‌సైట్: www.ignou.ac.in
 
 ఉద్యోగావకాశాలు:
 సేల్స్ ఎగ్జిక్యూటివ్  సర్వీస్ సూపర్‌వైజర్
 యాడ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్  టూర్ ప్లానర్
 
 ఇండస్ట్రియల్ ఆటోమేషన్ కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
 -వినయ్, వరంగల్.
 ఇండస్ట్రియల్ మెషినరీ, ప్రాసెసస్‌లకు సంబంధించిన కంట్రోల్ సిస్టమ్స్ అధ్యయనమే ఇండస్ట్రియల్ ఆటోమేషన్. ఈ కోర్సును అందించే కొన్ని ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు...
 బెల్గాంలోని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్సిటీ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్‌లలో ఎంటెక్ కోర్సును ఆఫర్ చేస్తోంది.
 వెబ్‌సైట్: http://vtu.ac.in
 లక్నోలోని ఉత్తరప్రదేశ్ టెక్నికల్ యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్‌లో పార్ట్‌టైం ఎంటెక్ కోర్సు ను ఆఫర్ చేస్తోంది. ఈ కోర్సులో ఇండస్ట్రియల్ సిస్టం ఇంజనీరింగ్‌లో స్పెషలైజేషన్ ఉంటుంది.
 వెబ్‌సైట్: http://www.uptu.ac.in
 కాలికట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రాని క్స్ - ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ.. ఇండస్ట్రియల్ ఆటోమేషన్‌లో పీజీ డిప్లమా కోర్సును అందిస్తోంది.

అర్హత: ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్/కెమికల్ ఇంజనీరింగ్/ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/మెకట్రోనిక్స్/కంప్యూటర్ సైన్స్‌లలో బీఈ/బీటెక్.
 ప్రవేశం: యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా
 వెబ్‌సైట్: www.doeacccalicut.ac.in
 హైదరాబాద్‌లోని ప్రొలిఫిక్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ.. ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్స్ ట్రైయినింగ్‌ను ఇస్తూ సర్టిఫికేట్స్ అందిస్తోంది. ఈ కోర్సులో ఎస్‌సీఏడీఏ సాఫ్ట్‌వేర్‌ను కవర్ చేయడంతో పాటు లీడింగ్ బ్రాండ్స్‌పై శిక్షణ ఇస్తారు.
 వెబ్‌సైట్: www.plcscadatraining.com
 
 ఉద్యోగావకాశాలు:
 ఆటోమొబైల్ రంగం; కెమికల్ రంగం; బాటిలింగ్ రంగం; గ్లాస్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగం; పవర్ జనరేషన్ రంగం; క్రాఫ్ట్ మాన్యుఫాక్చర్ రంగం
 
 ఎంబీఏ అకౌంట్స్‌తో పాటు ఏ కోర్సులు చేస్తే ఉద్యోగావకాశాలు అధికంగా ఉంటాయో వివరించండి?
 -విష్ణు, జడ్చర్ల
 ఫైనాన్షియల్ అనలిస్ట్ కోర్సు: ఈ కోర్సు చేయడం ద్వారా స్టాక్ బ్రోకింగ్ సంస్థల్లో/సొంతంగా ట్రేడింగ్ చేయగలుగుతారు. నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ ఫైనాన్షియల్ మార్కెట్స్‌లో సర్టిఫికేషన్ ద్వారా స్టాక్ మార్కెట్‌లో ట్రాన్సాక్షన్స్ చేయడానికి వీలవుతుంది. ఈక్విటీ డెరివేటివ్స్, క్యాపిటల్ మార్కెట్, డెరివేటివ్స్ మార్కెట్, కమోడిటీస్ మార్కెట్, ఆప్షన్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ లాంటి ఎన్నో మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిని నేర్చుకోవడం ద్వారా ఇందులో ప్రావీణ్యాన్ని సాధించవచ్చు.

 
 శాప్(ఎస్‌ఏపీ): మంచి ఉద్యోగ భవిష్యత్తుకు శాప్ మరో మార్గం. దీంట్లో అనేక టేబుల్స్, మాడ్యూల్స్ ఉంటాయి. ఇవి ఒకదానితో ఒకటి అనుసంధానం కలిగి ఉంటాయి. శాప్ ఎఫ్‌ఐ/సీఓ, శాప్ హెచ్‌ఆర్‌లు ఇందులో ఎంబీఏకి అవసరమైన మాడ్యూల్స్.శాప్ ఎఫ్‌ఐ/సీఓ: కంపెనీకి సంబంధించిన అకౌంట్స్‌తో పాటు ఫైనాన్స్‌కు సంబంధించిన డేటాను కవర్ చేస్తుంది. దీని ద్వారా కీలక నిర్ణయాలు తీసుకోడానికి ఉపయోగపడుతుంది.శాప్ హెచ్‌ఆర్: ఇది హ్యూమన్ రీసోర్సెస్ డేటాను కవర్ చేస్తుంది. ఇది పూర్తిగా సంస్థకు సంబంధించిన హ్యూమన్ రీసోర్సెస్ డేటాకు సంబంధించింది. కంపెనీలు  దీనిలో నైపుణ్యం సాధించిన హెచ్‌ఆర్ మేనేజర్లను నియమించుకుంటున్నారు.
 
 బేసిక్ కంప్యూటర్ కోర్సులు:
 ఏ ఉద్యోగం చేయడానికైనా కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. వర్క్‌లో ఉపయోగపడే ఎంఎస్ ఆఫీస్‌కు సంబంధించిన కోర్సులు ముందుగా నేర్చుకోవడం కలసివస్తుంది. దీంతో పాటు ఇంటర్నెట్ వినియోగం నేర్చుకోవాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement