తుపాకీ రాముడు.. బుడబుక్కలోడు! | ponnala laxmaiah takes on KCR | Sakshi
Sakshi News home page

తుపాకీ రాముడు.. బుడబుక్కలోడు!

Published Thu, Apr 10 2014 8:10 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

తుపాకీ రాముడు.. బుడబుక్కలోడు! - Sakshi

తుపాకీ రాముడు.. బుడబుక్కలోడు!

 జనగామ/పాలకుర్తి, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తుపాకీరాముడని, ఆయనిచ్చే ఎన్నికల హామీలు ఆచరణ సాధ్యం కావని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. బుధవారం ఆయన వరంగల్ జిల్లా జనగామ, పాలకుర్తిలో జరిగిన సభల్లో మాట్లాడారు. వర్రుబోతు కేసీఆర్ మాటలను నమ్మవద్దన్నారు.

ఆయన ఇచ్చే హామీలకు ప్రతీ ఏటా రూ.5లక్షల కోట్లు అవసరమని, కానీ ప్రభుత్వ బడ్జెట్ రూ.80వేల కోట్లు మాత్రమే ఉంటుందని.. ఇందులో నుంచే ఉద్యోగుల జీతాలు ఇవ్వాలని, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నారు. కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి పనులూ చేయలేదన్నారు. తెలంగాణ ఉద్యమానికి గండి కొట్టిన, ఉద్యమాన్ని అడ్డుకున్న నేతలకు పార్టీ టికెట్‌లు ఇచ్చాడని విమర్శించారు.
 
  కేసీఆర్ తానే తెలంగాణ తెచ్చానని మాటలు చెబుతూ.. ఎన్నికలు రాగానే బుడబుక్కలోడి వేషాలేస్తున్నాడని పొన్నాల విమర్శించారు. ఇద్దరు ఎంపీలున్న టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చామని చెబితే నమ్మే వారెవరూ లేరన్నారు. తెలంగాణ వ్యతిరేక పార్టీలైన బీజేపీ, టీడీపీ, సీపీఎంలతో కేసీఆర్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నాడని ఆరోపించారు. సకల జనుల సమ్మె జరుగుతున్న సమయంలో కేసీఆర్ ఫాం హౌస్‌లో పడుకున్నాడని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ 100 అసెంబ్లీ, 15 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని పొన్నాల ధీమా వ్యక్తం చేశారు. సోనియా, కాంగ్రెస్, తెలంగాణ ఈ మూడు అంశాలే తమ ప్రచారాస్త్రాలని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement