బాబు జమానా అవినీతి ఖజానా | Treasury corruption in Chandrababu Naidu's rule | Sakshi
Sakshi News home page

బాబు జమానా అవినీతి ఖజానా

Published Fri, May 2 2014 2:36 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

Treasury corruption in Chandrababu Naidu's rule

ఎ. అమరయ్య: ‘‘అధికారం మనుషుల్ని అవినీతిపరుల్ని చేయదు. పూల్స్ (మూర్ఖులు) అధికారంలోకి వచ్చినప్పుడు అధికారమే అవినీతిమయం అవుతుంది’’ అన్న జార్జ్ బెర్నార్డ్ షా వూటలు ఎంత సత్యమో చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనను చూస్తే అర్థవువుతుంది. వూవుకు వెన్నుపోటు పొడిచి అధికార పీఠాన్ని చెరబట్టిన చంద్రబాబు.. తన పాలన సవుస్తాన్ని అవినీతికి అంకితం చేశారు. ఒక్కటా.. రెండా.. లెక్కకు మిక్కిలి కుంభకోణాలు! రోజుకో అవినీతి ఆరోపణ.. నెలకో స్కాంలతో సాగిన బాబు పాలనపై ఆయనకు గతంలో మిత్రపక్షంగా ఉన్న సీపీఎం ఏకంగా ‘బాబు జమానా, అవినీతి ఖజానా’ అంటూ పుస్తకాన్నే అచ్చేసింది. ఆ పుస్తకంలోని వివరాలు యుథాతథంగా..
 
‘దేశం’ పాలనలో అవినీతికి అనర్హమైందేదీ లేదు ‘‘చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి తప్పుడు పనులు. ఇది తెలుగుదేశం పార్టీ పద్ధతి. అవినీతిని దరిచేరనీయం అని రంకెలు వేస్తారు. మం త్రులు, శాసనసభ్యుల్లో అవినీతి కంపు కొడుతుంటే మాత్రం పడిశం పట్టిన ముక్కులాగా వ్యవహరిస్తారు. కేంద్రంలో తిష్టవేసిన బీజేపీ ఇంతకన్నా భిన్నంగా లేదు.... బీజేపీ, టీడీపీలు కుంభకోణాలను సర్వసాధారణం చేశాయి. తెలుగుదేశం పాలనలో అవినీతికి అనర్హమైందేదీ లేదు. పేదల కడుపు నింపడానికి ఉద్దేశించిన కరువు బియ్యాన్ని సైతం కాజేశారు.
 - బాబు జమానా, అవినీతి ఖజానా పుస్తకానికి ముందుమాటలో బీవీ రాఘవులు
 
 ఇప్పుడూ అదే వూట చెబుతున్నాం
 అవినీతిపై పూటకో మాట మాట్లాడం. 2003లో  ఏం చెప్పామో 2014లోనూ అదే చెబుతున్నాం. మేం గతంలో ఏమి చెప్పామో దానికే కట్టుబడి ఉన్నాం. చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందన్నదే మా వాదన. మా ఆరోపణలన్నింటికీ ఆ పుస్తకంలో (బాబు జమానా- అవినీతి ఖజానా) ఆధారాలు కూడా ఇచ్చాం. చంద్రబాబు హయాంలో అంత సవ్యంగానే సాగితే ప్రజలు ఆయన్ను ప్రతిపక్ష స్థానంలో ఎందుకు కూర్చోబెడతారు? ఇప్పటికయినా నిజానిజాలు బయటకు రావాలి. దోషులెవరో తేలాలి. వచ్చే ప్రభుత్వాలైనా విచారణ జరిపించాలి.    
 - తమ్మినేని వీరభద్రం (2014, ఏప్రిల్ 17)
 
 కుంభకోణాల పర్వం ఇలా..
 బయటకు పొక్కిన ముఖ్య కుంభకోణాలు    15
 వీటిల్లో జరిగిన అవినీతి సుమారు     రూ.12,367 కోట్లు
 బయటపడని కుంభకోణాలు లెక్కకుమిక్కిలి... అప్పట్లో వాటి విలువ ఆర్థికవేత్తల లెక్క ప్రకారం    రూ.10,000 కోట్లు
 
 బాబు హయూంలో స్కాంల చిట్టా..
నకిలీ స్టాంపుల కుంభకోణం    రూ.5 వేల కోట్లు
 మూతపడిన అర్బన్ బ్యాంకుల్లో డిపాజిట్లు    రూ.2 వేల కోట్లు
 వాటర్‌షెడ్ పథకం    రూ.2 వేల కోట్లు
 నీరు-మీరు పథకం    రూ.1600 కోట్లు
 మద్యం అక్రమాలు    రూ.600 కోట్లు
 పనికి ఆహార పథకం    రూ.560 కోట్లు
 ప్రభుత్వ సంస్థల అమ్మకం వల్ల నష్టం    రూ.400కోట్లు
 టూరిజానికి ఇచ్చిన స్థలాల విలువ    రూ.350 కోట్లు
 సోమశిల భూముల కుంభకోణం    రూ.112 కోట్లు
 ఏలేరు భూ కుంభకోణం    రూ.100 కోట్లు
 స్కాలర్‌షిప్పుల్లో అవినీతి    రూ.100కోట్లు
 మాదాపూర్‌లో రహేజా సంస్థకు స్థలం    రూ.50 కోట్లు
 విజయవాడ సిమెంట్ ఫ్యాక్టరీ స్థలం    రూ.55 కోట్లు
 టైమర్ల కుంభకోణం    రూ.30 కోట్లు
 ముఖ్యమంత్రి సహాయనిధి    రూ.10 కోట్లు
 మొత్తం విలువ (రూ.కోట్లలో)    12,367
 
 రాష్ట్రంలో అవినీతి పెరిగింది. పారదర్శకత లోపించింది. ప్రభుత్వ కాంట్రాక్టులు పొందడానికి లంచాలు తప్పనిసరయ్యాయి. ప్రత్యేకించి రూ.5 కోట్లు దాటిన పనుల్లో అవినీతి మామూలైంది. బ్రిటీష్ ప్రభుత్వ సంస్థ డీఎఫ్‌ఐడీ సహా అన్ని ప్రభుత్వ నిధుల్లో మూడో వంతు నిధుల్ని ఎమ్మెల్యేలే దారి మళ్లిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలైతే నేరగాళ్లకు కూడా సహకరిస్తున్నారు. చివరకు న్యాయ వ్యవస్థలోనూ అవినీతి పెరిగిపోయింది. సకాలంలో న్యాయం పొందలేని వారు నేరగాళ్లను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్రంలో నేరస్తులు పంచాయితీలు చేయడం, దందాలు చేయడం పెరిగి ప్రస్తుతం ఇదో పరిశ్రమగా వర్ధిల్లుతోంది.
 - బ్రిటన్‌లోని ససెక్స్ విశ్వవిద్యాలయం
 
 పరిశోధకుడు జేమ్స్ మనర్ నివేదిక
 ఆదరణ నిరాదరణ అయిందిలా...
 చేతి వృత్తుల్ని నిలువునా ధ్వంసం చేసిన సరళీకరణ విధానాలకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు ఆయా వర్గాలను ఆదుకునే పేరిట 1999 ఎన్నికల ముందు ఆదరణ పథకాన్ని తీసుకువచ్చారు. రూ.625 కోట్ల రూపాయలతో పది లక్షల మంది వృత్తిదారులకు ప్రయోజనం చేకూర్చడం దీని లక్ష్యం. కానీ, జరిగిందేమిటంటే లబ్ధిదారుల ఎంపికలో పాలకపార్టీ అయిన టీడీపీ పైరవీలు ఎక్కువయ్యాయి. అడుగడుగునా మోసం జరిగింది.
 
పని ముట్లలో నాణ్యతా లోపం, వాస్తవ ధరకు మించిన మార్కెట్ రేటుతో కొటేషన్లు తీసుకుని నాసిరకం పరికరాలను లబ్ధిదారులకు అంటగట్టారు. జరిగిన మోసం ఏమిటో తెలిసే లోపల ఆదరణ పథకం నిరాదరణకు గురైంది. 1999 ఎన్నికలు పూర్తయ్యే నాటికి రూ.200కోట్లు ఆవిరైపోయాయి. దొరికినోడు దొరికినంత దోచుకున్నారు. లబ్ధిదారులకు టోపీ పెట్టారు. దొంగల్ని పట్టుకుంటానని శపథం చేసిన చంద్రబాబు చిట్టచివరకు ఏసీబీ విచారణకు ఆదేశించి చేతులు దులుపుకోవడం కొసమెరుపు.
 
 బాబు హయాంలో కోర్టుల్లో అవినీతి కేసులు ఇలా..
 ఏసీబీ కేసులు              -    995
 ఏసీబీయేతర కేసులు    -    3,858
 మొత్తం కేసులు              -    4,853
 చార్జిషీట్ పెట్టినవి               -    143
 శిక్షలు పడినవి             -    38
 
 ఆ ఆస్తులు.. అవినీతికి సాక్ష్యాలు
 హరికృష్ణ స్థాపించిన అన్న తెలుగుదేశం పార్టీ ప్రచురించినపుస్తకం ఇది. దీనిలో వివరించి చెప్పిన బాబు అవినీతి చరిత ఇదిగో...
 -     వెంకటగిరి భూములను ప్రభుత్వ బుల్డోజర్లతో బాబు చదును చేయించుకున్నాడు. మాదాపూర్‌లో భూములు, బెంగుళూరులో ఆస్తులు బాబు అవినీతికి సాక్ష్యాలు.
-   హైటెక్‌సిటీకి బిజినెస్ స్కూల్‌కు ధారాదత్తం చేస్తున్న భూములతో రాష్ట్రానికి ఒరగబెట్టిందేమిటీ? సబ్సిడీ భారం భరించలేమంటూ ప్రజల నోటి వద్ద కూడు కాజేసి, కరెంటు ఖర్చులు పెం చేసి, పేదవారి లోగిళ్లలో దీపాలు ఆర్పేసిన బాబు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని విదేశీ పెట్టుబడిదారులకు దోచిపెడుతున్నాడు. వారిచ్చే కమీషన్లకు, నజరానాలకు ఆశపడి రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు. ఏ.పి. వ్యాన్ పేరిట మలేషియా ఎలక్ట్రానిక్ కన్సార్టియంకు రాష్ట్ర ప్రభుత్వ శాఖల అజమాయిషీనే అప్పగిస్తున్నాడు.
 
-     గత నాలుగేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు, తీసుకున్న ఆర్థిక నిర్ణయాల చిట్టా విప్పితే రాష్ట్రాన్ని ఆయన ఎలా నిలువుదోపిడీ చేశారో తెలుస్తుంది. ప్రైవేటు విద్యుత్ సంస్థల పెట్టుబడుల కు 60 శాతం గ్యారంటీలపై సంతకాలు చేయడం ఎవరి మేలుకోసం? హిందూజా పవర్ కార్పోరేషన్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని విప్పిచూస్తే దానికిచ్చిన హిరణ్యాక్ష వరాల బండారం బయట పడుతుంది. బొగ్గు సరఫరాలో ఆలస్యం జరిగితే అందుకు నాలుగింతలు ప్రభుత్వం చెల్లించుకోవాలన్న నిబంధన ఎవరిని ఉద్ధరించడానికి? ప్రైవేట్ విద్యుత్‌ను యూనిట్ ఐదు రూపాయలిచ్చి కొనుక్కోవాల్సిన దుర్గతిలోకి ప్రజలను నెట్టేసే అధికారం ఈయనకు ఎవరిచ్చారు?
 
 -    50 వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బోర్డు దేశంలోనే అత్యంత పటిష్టమైన సంస్థ. పవర్‌లోడ్ ఫ్యాక్టర్‌లో సాటిలేని మేటి. కుట్ర పన్ని దీనిని కూలగొట్టిన ఘన చరిత్ర బాబుది. చిన్నాచితకా  ప్రైవేటు జలవిద్యుత్ సంస్థలకు సైతం దోచిపెట్టడానికి వెనుకాడలేదు మన ‘డైనమిక్’ హైటెక్ బాబు.
-     కాకినాడ, గంగవరం రేవుల ప్రైవేట్ పరం చంద్రబాబు అవినీతి లీలలకు మరో మచ్చుతునక. కాకినాడ రేవును ప్రైవేటుకిచ్చినట్టే ఇచ్చి 350 కోట్ల రూపాయల ప్రభుత్వరుణాన్ని కూడా కట్టబెట్టడంలోని ఆంతర్యం ఏమిటీ? ఇందులో బాబు అవినీతి కంపు గుప్పుమనడం లేదా? రేవు ప్రైవేటీకరణలో ఆయనకు స్వయంగా వాటాలున్నాయన్నది వాస్తవం కాదా?
-     రాష్ట్రానికి కార్ల ప్రాజెక్టులను సాధించే నెపంతో సింగపూర్ యాత్రలు చేసిన బాబు చివరికి పొడిచిందేమిటి? తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి రెండు కార్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేస్తే, ఈయన హైదరాబాద్‌లో కార్ల షోరూంలకు రిబ్బన్ కత్తిరించారు. సింగపూర్‌లో సొంత వ్యాపారాలు చక్కదిద్దుకునేందుకు, విదేశీ బ్యాంకుల్లో డబ్బు దాచుకోవడానికి బాబు మలేషియా, స్విడ్జర్లాండ్ పర్యటనలు ఆయన కొత్త ఆర్థిక చుట్టరికాలకు ఆనవాళ్లు. కాంగ్రెస్ వాళ్లు గొర్రెల్ని తింటే ఆయన బర్రెల్నే కబళిస్తున్నాడు.
-     అంజయ్య హయాంలో యాదగిరి హెలికాప్టర్  మీద యాగీ చేసిన వారు చంద్రబాబు రెండు హెలికాప్టర్లతో కులుకుతూఉంటే నోరుమెదపరేమీ?ఒక హెలికాప్టర్ ఉండగా 18 కోట్ల రూపాయలతో కొత్తది కొనడంలో ప్రజాసేవ ఎటువంటిది?తృటిలో వచ్చే ఐఏఎఫ్ హెలికాప్టర్లుండగా ప్రత్యేక హెలికాప్టర్ అవసరం ఏమిటీ? ప్రతి కొనుగోలులోనూ ముడుపులే ముడుపులు.
- ఇంటర్, ఎమ్‌సెట్, లాసెట్ చివరికి పోలీసు కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో అవకతవకలు చంద్రుడిలోని మచ్చలకు మచ్చుతునకలు. జనార్దనరెడ్డి హయాంలో ప్రైవేటు డెంటల్, మెడికల్ అనుమతిస్తే గగ్గోలు పెట్టిన బాబు ఇప్పుడు ఊరికొక ఇంజనీరింగ్ కాలేజీ, జిల్లాకొక మెడికల్ కాలేజీ ధారపోస్తున్నాడు. కేవలం స్వీయ ప్రయోజనాల కోసమే ప్రజలపై ప్రైవేలు గొడ్డలి వేసి చిద్విలాసం చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement