వర్షాకాలం... స్ప్రే, జెల్తో బలహీనం...
బ్యూటిప్స్
వర్షాకాలంలో శిరోజాల సంరక్షణ పెద్ద కష్టమేమీ కాదు. అలాగని, సులువుగా పూర్తిగా వదిలేయలేం. వెంట్రుకలు పొడిబారడం, చిట్లడం.. ఈ కాలం ప్రధాన సమస్యలుగా ఉంటాయి.
♦ఈ కాలం హెయిర్ స్ప్రేలు లేదా జెల్స్ ఉపయోగించకూడదు. వర్షంలో నానినప్పుడు స్ప్రే చేసినవి, జెల్ రసాయనాలు మాడుకు పట్టుకుంటాయి. ఇవి మాడును నిస్తేజంగా మార్చడం, వెంట్రుకల కుదుళ్లను బలహీనంగా మారుస్తాయి.
♦ ప్రతి రోజూ రాత్రి పడుకునేముందు మునివేళ్లతో మాడును మృదువుగా మర్దనా చేసుకోవాలి. దీంతో రక్తప్రసరణ మెరుగవుతుంది.
♦ చల్లగా ఉంటుంది కదా అని మరీ వేడి నూనెలను ఉపయోగించకూడదు. వారానికి ఒకసారి గోరువెచ్చని నూనెను మర్దనకు ఉపయోగించి, శుభ్రపరుచుకుంటే చాలు.
♦ పొడవాటి జుట్టును ఎక్కువసేపు గట్టిగా ముడివేయడం వంటివి కాకుండా, వీలైనంత వదులుగా ఉండేలా జాగ్రత్త తీసుకోవడం మంచిది.
♦ తలకు నూనె పెట్టి ఉండటం, అలాగే వర్షంలో తడవడం, ఆ తర్వాత రెండు రోజులకు శుభ్రం చే యడం ఇలాంటి విధానం వల్ల వెంట్రుకలు మరింత దెబ్బతినే అవకాశం ఉంటుంది.
♦ రాత్రిపూట తలకు నూనె పెట్టి మర్దన చేసి, మరుసటి రోజు ఉదయం షాంపూ లేదా శీకాకాయతో జుట్టును శుభ్రం చేసుకోవ డం మంచిది.