ఆగస్టు 21న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: భూమిక (నటి);
ఉస్సేన్ బోల్ట్ (అథ్లెట్)
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 1. దీనికి అధిపతి సూర్యుడు. పుట్టిన తేదీ 21. అంటే మూడు. దీనికి అధిపతి గురుడు కావడం వల్ల ఈ సంవత్సరం వీరికి గురు, సూర్యుల ప్రభావంతో యువరాజ యోగం పడుతుంది. అందువల్ల జీవితంలో ఈ సంవత్సరం ఒక మైలురాయిలా నిలిచి పోతుంది. కొత్త అవకాశాలు, అనుకోని సంపద వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి, ఉద్యోగులకు పదోన్నతి కలుగుతుంది. బదిలీల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. కొత్తబంధాలు, కొత్త స్నేహాలు ఏర్పడతాయి. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి, ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అనువైన కాలం. ఈవేళ పుట్టిన రోజు జరుపుకుంటున్న వారు పెద్దవాళ్లయితే, వారిపిల్లలకి ఉద్యోగ, వివాహ యోగాలు కలుగుతాయి. పెళ్లయిన వారికి సంతానం ప్రాప్తిస్తుంది.
విద్యార్థులు గురు, సూర్యుల ప్రభావం వల్ల పోటీపరీక్షలలో కృతార్థులవుతారు. విదేశాలకు వెళ్లాలనే కోరిక బలపడుతుంది. కొత్త ఆలోచలు, తియ్యగా మాట్లాడటం వంటి లక్షణాలతో అనుకున్న పనులను అవలీలగా సాధిస్తారు. లలిత కళలలో ప్రావీణ్యం ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి.
లక్కీ నంబర్స్: 1,3,5,6,9; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, రెడ్, ఎల్లో, క్రీమ్, గోల్డెన్; సూచనలు: దక్షిణామూర్తికి అభిషేకం, ఆదిత్య హృదయ పారాయణ చేయడం లేదా వినడం మంచిది. ఆవులకి, అంగవైకల్యం ఉన్న వారికి ఆహారం పెట్టడం, మదరసాలలో, చర్చిలలో అన్నదానం చేయించడం, పేదవిద్యార్థులకు పుస్తకాలు పంచడం మంచిది.
- డాక్టర్ మహమ్మద్ దావూద్