ఫ్రిజ్ మ్యాట్స్: ఫ్రిజ్ అరలను శుభ్రపరచడం ప్రతీసారి పెద్ద పనిగా ఉంటుంది. అదే, ప్లాస్టిక్ షీట్స్‌ను ఫ్రిజ్‌లోని అరలకు తగినవిధంగా సెట్ చేసుకొని అమర్చుకుంటే అరలను పదే పదే శుభ్రపరచాల్సిన అవసరం పడదు. మురికిగా అనిపించిన వెంటనే మ్యాట్స్ బయటకు తీసి, కడిగేయడం సులువు.
టొమాటో కెచప్: రాగి పాత్రలు కొత్తవాటిలా మెరవాలంటే టొమాటో కెచప్ లేదా టొమాటో గుజ్జుతో రుద్ది కడగాలి.
ట్యాప్స్: కిచెన్‌లోని సింక్ ట్యాప్స్ గారపట్టి మురికిగా కనిపిస్తుంటాయి. వీటిపైన నిమ్మముక్కతో బాగా రుద్ది, తర్వాత సబ్బునీటితో కడగాలి. ట్యాప్‌లు కొత్తవాటిలా మెరుస్తాయి.