ఈ వారం యూట్యుబ్ హిట్స్‌ | youtube hits in this week | Sakshi
Sakshi News home page

ఈ వారం యూట్యుబ్ హిట్స్‌

Published Tue, Feb 14 2017 11:35 PM | Last Updated on Tue, Sep 5 2017 3:43 AM

ఈ వారం యూట్యుబ్ హిట్స్‌

ఈ వారం యూట్యుబ్ హిట్స్‌

బ్యూటీ అండ్‌ ది బీస్ట్‌: ఫైనల్‌ ట్రైలర్‌
నిడివి : 2 ని. 31 సె., హిట్స్‌ : 1,29,44,225

1991లో ‘బ్యూటీ అండ్‌ ది బీస్ట్‌’ అనే ఏనిమేటెడ్‌ ఫిల్మ్‌ వచ్చింది. ఇప్పుడు దాన్నే, అదే పేరుతో లైవ్‌ యాక్షన్‌తో (సెమీ ఏనిమేషన్‌) నిర్మిస్తోంది వాల్డ్‌ డిస్నీ పిక్చర్స్‌. మార్చి 17న విడుదల అవుతున్న ఈ రొమాంటిక్‌ ఫాంటసీ మ్యూజికల్‌ మూవీని బిల్‌ కాండన్‌ డైరెక్ట్‌ చేస్తున్నారు. మూవీ లాస్ట్‌ ట్రైలర్‌ ఇది! టైటిల్‌కి తగ్గట్లే బ్యూటిఫుల్‌గానూ, బీస్ట్‌లీగానూ ఉంది. బెల్‌ అనే ఒక అందమైన అమ్మాయి ఉంటుంది (సినిమాలో ఎమ్మా వాట్సన్‌). ఒక మృగమానవుడు (డాన్‌ స్టీవెన్స్‌) బెల్‌ తండ్రిని బంధిస్తాడు. నన్ను బందీగా ఉంచుకుని మా నాన్నను విడిచిపెట్టు అని బెల్‌ అడుగుతుంది. అయితే ఆమె కూడా బీస్ట్‌కి బందీగా ఉండిపోవలసి వస్తుంది. ఆ క్రమంలో లోపలి పరిచారకులతో బెల్‌ దగ్గరవుతుంది. బీస్ట్‌లోని మానవ హృదయాన్ని అర్థం చేసుకుంటుంది. అప్పుడే గ్యాస్టన్‌ అనే హంటర్‌ పాత్ర ఎంటర్‌ అవుతుంది. ఆ గ్యాస్టన్‌ అనే అతడు బెల్‌ని ప్రేమిస్తాడు. బెల్‌ కోసం బీస్ట్‌తో తలబడతాడు. డీస్నీ డిజిటల్‌ 3డీ, రిలయ్‌డి, ఐమాక్స్‌ 3డి ఫార్మాట్‌లలో విడుదలకు సిద్ధం అవుతున్న బ్యూటీ అండ్‌ ది బీస్ట్‌ ఈ వేసవిలో పిల్లలతో పాటు పెద్దలకూ ఆహ్లాదం కలిగించబోతోందని ట్రైలర్‌ను చూస్తే అర్థమౌతోంది. ఇందులో బ్యూటీతో బీస్ట్‌ చేసే సొగసైన, మర్యాదకరమైన డాన్స్‌ను చూసి తీరాల్సిందే.

బద్రీనాథ్‌ కీ దుల్హనియా: ట్రైలర్‌
నిడివి : 2 ని. 59 సె., హిట్స్‌ : 2,01,34,035

లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ ఎలా ఉంటుందో మీకు తెలియకపోయినా నో ప్రాబ్లమ్‌. ఫస్ట్‌ లవ్‌ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. అదీ ఈ హోలీకి రిలీజ్‌ అవుతున్న కరణ్‌ జోహార్‌ ‘బద్రీనాథ్‌ కీ దుల్హనీయా’ సినిమా చూసి తెలుసుకోవాలి. డైరెక్షన్‌ శశాంక్‌ ఖైతాన్‌. బద్రీనాథ్‌ బన్సాల్‌ (వరుణ్‌ ధావన్‌), వైదేహి త్రివేది (ఆలియా భట్‌) మధ్య.. చిలిపిలిపిగా, కోపంగా, అల్లరిగా, పిచ్చిపిచ్చిగా, ఆవేదనగా, ఆహ్లాదంగా సాగే ఈ ప్రేమ ప్రయాణం మిమ్మల్ని నవ్వుల్లో ముంచెత్తడం ఖాయం. డైలాగులైతే హాల్లో తిన్నగా కూర్చోనిస్తాయన్న గ్యారెంటీ లేదు. అంత ఎనర్జీ ఉంది! ఈ ఇండియన్‌ కామెడీ రొమాంటిక్‌ ఫిల్మ్‌ మార్చి 10న విడుదల అవుతోంది. 2014 నాటి ‘హమ్టీ శర్మ కీ దుల్హనీయా’ కు ఇది సీక్వెల్‌.

నామ్‌ షబానా: ట్రైలర్‌
నిడివి : 2 ని. 12 సె., హిట్స్‌ : 18,78,775

నామ్‌ షబానా ట్రైలర్‌ విడుదలైంది! ఈ యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌ బాలీవుడ్‌ మూవీలో తాప్సీ పన్నూ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. జాతీయ భద్రతే ప్రధాన అజెండాతో పనిచేసే ఒక ఏజెన్సీ తాప్సీ సహాయం కోరుతుంది. ఆమెకు కావలసిన ఇన్‌ఫర్మేషన్‌ అంతా ఇస్తుంది. తమకు కావలసింది సేకరించిపెట్టమని అడుగుతుంది. తాప్సీ రంగంలోకి దిగాక సినిమాలోని అసలు థ్రిల్‌ ప్రారంభం అవుతుంది. ఎ వెడ్నెస్‌డే, స్పెషల్‌ 26, బేబీ, ఎమ్‌.ఎస్‌.ధోనీ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ వంటి చిత్రాలకు కథను అందించి, దర్శకత్వం వహించిన నీరజ్‌ పాండే.. ఈ చిత్రానికీ స్క్రిప్టు రాశారు. డైరెక్షన్‌ శివమ్‌ నాయర్‌. ఇందులో మనోజ్‌ బాజ్‌పేయీ ఏజెన్సీ హెడ్‌గా నటిస్తున్నారు. అక్షయ్‌ కుమార్, అనుపమ్‌ ఖేర్‌ అతిథి పాత్రలో కనిపిస్తారు. స్పైయింగ్‌లోకి దిగిన ఒక ఆడపిల్ల జీవితం క్షణక్షణానికి ఎన్ని మలుపులు తిరుగుతుందో ట్రైలర్‌లో చూపించారు. సినిమాను మార్చి 31న చూపించబోతున్నారు. 2015 ‘బేబీ’ చిత్రంలోని తాప్సీ పాత్రకు ఇది కొనసాగింపు రోల్‌.

Advertisement
Advertisement