ఈ వారం యూ ట్యూబ్‌ హిట్స్ | YouTube hits this week | Sakshi
Sakshi News home page

ఈ వారం యూ ట్యూబ్‌ హిట్స్

Published Sun, Jun 19 2016 10:48 PM | Last Updated on Mon, Sep 4 2017 2:53 AM

ఈ వారం యూ ట్యూబ్‌  హిట్స్

ఈ వారం యూ ట్యూబ్‌ హిట్స్

కబాలి టీజర్ (నెరుప్పు డ సాంగ్)
నిడివి : 35 సె.
హిట్స్ : 39,01,803

కబాలి టీజర్ సాంగ్.. ‘నెరుప్పు డ’ యువతరాన్ని షేక్ చేస్తోంది! యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన రెండు రోజుల్లోనే హిట్స్ 30 లక్షలు దాటాయి. రజనీకాంత్ ఇందులో గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నారు. రాధికా ఆప్టే హీరోయిన్. తమిళం, తెలుగు, హిందీ వెర్షన్‌లలో జూలై 15న విడుదల అవుతున్న కబాలి ఎలా ఉంటుందో శాంపిల్‌గా ఈ టీజర్‌లో చూడొచ్చు. స్ట్రీట్ ఫైటర్ రజనీ.. బాటిల్ విసిరి కారు విండో పగల గొట్టడంతో టీజర్ స్టార్ట్ అవుతుంది. నెక్ట్స్ సీన్‌లో బౌన్సర్స్ జనాన్ని తోస్తూ ఉండగా గ్యాంగ్‌స్టర్ రజనీ స్టెయిల్‌గా నడుచుకుంటూ వస్తారు. ఆ తర్వాత రాధికది ఒక చిన్న బిట్. అది ఆయ్యాక రజనీ ఎదుట ప్రత్యర్థి ‘కబాలీ’ అంటూ మోకరిల్లడం, ఈ సీన్స్ అన్నిటి వెనకాల సంతోష్ నారాయణన్ మ్యూజిక్.. వీడియోను రిచ్‌గా, ఎఫెక్టివ్‌గా చూపించాయి. ఇన్‌స్టంట్ ఉత్సాహం కోసం కోక్‌ని తాగినట్టు.. ఈ కబాలీ టీజర్‌ను చూడొచ్చు.

 

దిస్ ఈజ్ వాట్ యు కేమ్ ఫర్ : వీడియో
నిడివి : 3 ని. 59 సె.
హిట్స్ : 1,38,94,820

‘అందరూ ఆ అమ్మాయిని చూస్తున్నారు.. ఆ అమ్మాయి మాత్రం నీ కోసం చూస్తోంది!’. రియానా, కేల్విన్ హ్యారిస్.. ఇద్దరూ కలిసి మిక్స్ చేసి కొట్టిన మ్యూజిక్ వీడియో ‘దిస్ ఈజ్ వాట్ యు కేమ్ ఫర్’లోని సాంగ్ ఇది. అయితే రియానా తన దీర్ఘకాలిక వదంతుల స్నేహితుడు ‘డ్రేక్’ కోసం గతంలో రికార్డ్ చేసిన ‘హాట్‌లైన్ బ్లింగ్’కి, దీనికీ కొన్ని పోలికలు కనిపిస్తాయి. అలాగని నిరుత్సాహ పడే పని లేదు. బార్బడోస్ దేశపు 28 ఏళ్ల గాయని రియానా ఆలపించిన ఈ వీడియోలో ‘బ్లింగ్’ని మించిన ఎమోషన్స్ చాలా ఉన్నాయి. స్కాటిష్ డీజే కేల్విన్ హ్యారిస్ అలా కనిపించి, ఇలా కనుమరుగైపోతారు (ఎక్కడో కనిపెట్టండి). భుజాల కిందికి జారుతుండే సిల్వర్ జంప్‌సూట్‌తో లేజర్ వెలుగుల మధ్య రియానా 4డి గ్రీన్ స్క్రీన్ బాక్స్‌లలోని అడవుల్లో, ఎడారుల్లో, క్లబ్లుల్లో ఆ కాసేపూ తనతో పాటు మనల్నీ విహరింపజేస్తారు.

 

ఫీవర్ : అఫీషియల్ ట్రైలర్
నిడివి : 2 ని. 53 సె.
హిట్స్ : 27,12,304

అతడు ఒంటరిగా తింటాడు. ఒంటరిగా తాగుతాడు. ఒంటరిగా నిద్రపోతాడు. మారు వేషంలో తిరుగుతుంటాడు. అమ్మాయిలు అతడిని వెంటాడుతుంటారు. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. రాజీవ్ ఝవేరి డెరైక్ట్ చేస్తున్నారు. అజయ్ ఛబ్రియా నిర్మిస్తున్నారు. పేరు ‘ఫీవర్’. రాజీవ్ ఖండేల్‌వాల్ హీరో. గౌహర్ ఖాన్ హీరోయిన్. జమ్మా ఆట్కిన్‌సన్, క్యాటెరీనా మ్యురినో, అంకితా మక్వానా.. మిగతా ముగ్గురు అమ్మాయిలు. ఆ ఒంటరిగా తినేవాడు, ఒంటరిగా తాగేవాడు, ఒంటరిగా నిద్రపోయేవాడు ఓ కాంట్రాక్ట్ కిల్లర్. ఆక్సిడెంట్‌లో మెమరీ కోల్పోతాడు. తిరిగి మెమరీ ఎలా వచ్చింది? తర్వాత ఏం చేశాడు? ఇవన్నీ ఈ వీడియోలో అన్వేషించవచ్చు. పనిలో పనిగా ఎవరికి నచ్చే సన్నివేశాలను వారు ఆస్వాదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement