పాలకూర ఆకుల్లో గుండె కణజాలం | heart tissue in spinach leaves | Sakshi
Sakshi News home page

పాలకూర ఆకుల్లో గుండె కణజాలం

Published Mon, Apr 24 2017 6:55 PM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM

పాలకూర ఆకుల్లో గుండె కణజాలం

పాలకూర ఆకుల్లో గుండె కణజాలం

న్యూయార్క్‌: ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిదనే విషయం మనందరికి తెల్సిందే. ఆకు కూరల ఆకులలో మానవ గుండె కణజాలాన్ని పెంచవచ్చని అమెరికాలోని వోసెస్టర్‌ పాలిటెక్నిక్‌ ఇనిస్టిట్యూట్‌ పరిశోధకులు కనుగొన్నారు. వారు పాలకూర ఆకులను తీసుకొని వాటి నాళాల్లోని మొక్క కణజాలాన్ని డెటర్జెంట్‌ ద్రావకాన్ని ఉపయోగించి తొలగించారు. అనంతరం మానవ గుండె కణాలను ఆకుల నాళాల్లోకి పంపించారు.

ఐదు రోజుల తర్వాత ఆ కణజాలం అభివద్ధి చెంది ఆకుల నాళాల గుండా రక్తాన్ని ప్రవహింప చేశాయి. ఇలా పాలకూర లేదా అంతకంటే నాళాలు బలంగా ఉండే ఆకులను తీసుకొని గుండె పొరలను తయారు చేయవచ్చని, ఈ పొరలను ఉపయోగించి రానున్న రోజుల్లో గుండె జబ్బు రోగులకు వైద్యం చేయవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఆకుల్లో మానవ గుండె కణజాలాన్ని పెంచి రోగికి చికిత్స చేయాలంటే మరెన్నో ప్రయోగాలు నిర్వహించాల్సి ఉందని వోసెస్టర్‌ పాలిటెక్నిక్‌ ఇనిస్టిట్యూట్‌లో బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌లో సీనియర్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న గ్లెన్‌ గాడెట్టీ తెలిపారు.

Advertisement

పోల్

Advertisement