‘అభినందించలేదు..తప్పుపట్టాం’
Published Mon, Jan 30 2017 5:06 PM | Last Updated on Sat, Sep 15 2018 3:01 PM
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పై జరిగిన సమావేశంలో తమ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని అభినందించారన్నది అబద్దమని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. సబ్ ప్లాన్ చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయక పోవడాన్ని తమ పార్టీ ఖండించిందని వివరించారు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. కేటాయించిన నిధులను ఖర్చు పెట్టాలని తాము సూచించామని చెప్పారు. మిగిలిన నిధులను కూడా తర్వాత ప్రణాళికలో ఖర్చుపెట్టేలా చూడాలని కాంగ్రెస్ సూచించిందని వివరించారు. 2016-17 కు సంబధించిన కేటాయించిన నిధులను ఖర్చు చేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నామన్నారు. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి సమాధానం లేదని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీల జీవితాల్లో వెలుగులు నింపే ఈ చట్టానికి సర్కారు తూట్లు పొడిచిందని తెలిపారు. వేల కోట్ల నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు.
Advertisement
Advertisement