రామచంద్రన్ జీవితం స్ఫూర్తిదాయకం
- విశ్రాంత ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ
- సీఎస్ రామచంద్రన్ జీవిత విశేషాలపై పుస్తకావిష్కరణ
హైదరాబాద్: రిటైర్డ్ ఐసీఎస్ అధికారి సీఎస్ రామచంద్రన్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదా యకమని, ఆయన ఇంటి పేరు సీఎస్ అంటే కోమల కమలమని, ఆయన జీవితం విస్తార కోమల పరిమళాలు వెదజల్లుతుందని విశ్రాంత ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ అన్నారు. మంగళవారం సోమాజిగూడ ఆస్కీలో నిర్వ హించిన కార్యక్రమంలో రామచంద్రన్ జీవిత విశేషాలను వివరిస్తూ ఆయన కుమార్తె, విశ్రాం త ఐఏఎస్ అధికారి గాయత్రి రామచంద్రన్ రూపొందించిన పుస్తక సంకలనం ‘సీఎస్ రామచంద్రన్, ఐసీఎస్’ ఆవిష్కరణ కార్య క్రమంలో ఆయన అతిథిగా పాల్గొన్నారు. రామ చంద్రన్‌తో తాను గడిపిన çస్మృతులను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న విశ్రాంత ఐఏఎస్ అధికారులు వీకే రావు, టీఎల్ శంకర్, చక్రవర్తి, వైద్యుడు రంగా రావు తదితరులు మాట్లాడుతూ.. గొప్ప ఆగమ శాస్త్ర పండితుడైన రామచంద్రన్ పరమ భక్తు డని, ఆయనకు హిందూ వైదిక ధర్మాలపై ఆసక్తి ఎక్కువని వేదాలు, ఉపనిషత్తులను ఔపోసన పట్టారని కొనియాడారు.
తిరుపతి, కంచి కామ కోటి పీఠాలకు పరమ భక్తుడని, పీఠం ఆధ్వ ర్యంలో నడుస్తున్న పలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని చెప్పారు. పలు దేవాల యాలు పునరుద్ధరించారని, అలహాబాద్‌లోని త్రివేణి సంగమం వద్ద శంకర విమాన మం డపం నిర్మించారని, 1977లో అప్పటి ఉత్తర ప్రదేశ్ సీఎం కమలాపతి త్రిపాఠి ఏరికోరి ఆయన్ను బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయాల అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా నియమించారని గుర్తు చేసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి విశేష సేవలు అందించారన్నారు. ఢిల్లీ తమిళ ఎడ్యుకేషన్ సొసైటీ, సౌత్ ఇండి యన్ సమాజ్ సహా పలు ఆధ్యాత్మిక, విద్య, ఆరోగ్య సేవాసంస్థలను స్థాపించారని, ఆయన వారసుల ఆధ్వర్యంలో అవి విజయవంతంగా నడుస్తున్నాయని చెప్పారు. ఆయన కుమారు లు శ్రీనివాస్(తన 40వ ఏట ఐఏఎస్ అధికారి గా పనిచేస్తూ ప్రమాదంలో మృతిచెందారు), రాజేంద్రన్, కుమార్తె గాయత్రి రామచంద్రన్ ఐఏఎస్ అధికారులుగా పనిచేసి రిటైర్ అయ్యా రు, మరో కుమారుడు సుందరమూర్తి ఆడిట్ సర్వీస్ అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు. కార్యక్రమంలో రామచంద్రన్ కుమార్తె గాయత్రి రామచంద్రన్ వందన సమర్పణ చేశారు.
ప్రత్యేక ఆకర్షణగా వీకే రావు
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కురువృద్ధుడు, విశ్రాంత ఐసీఎస్ అధికారి వీకే రావు(102 ఏళ్లు) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 1940లో అప్ప టి ఐసీఎస్ సర్వీస్‌కు ఎంపికై బాధ్యతలు చేప ట్టిన వీకే రావు నేటికీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ఇద్దరు సహాయకులతో వేదిక మీద ఆసీనుడైన ఆయన కార్యక్రమంలో ప్రసం గించలేదు. పూర్తి శాఖాహారి అయిన రావు కొన్ని దశాబ్దాలుగా నిష్టతో కూడిన జీవితం గడుపుతున్నారని ఆయన కుమార్తె వాణిదేవి చెప్పారు. ఉదయం 8 గంటలకు ఫలహారం, మధ్యాహ్నం 12కు భోజనం, సాయంత్రం 4కు ఉపహారం, టీ తీసుకుంటారని, ప్రతి రోజు సాయంత్రం అరగంట నడక సాగిస్తార ని తెలిపారు. ఆయనకు బీపీ, షుగర్ సహా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవన్నారు. ఆయన కుమారుడు నారాయణ ఐఏఎస్ అధికారిగా రిటైర్ అయి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు.