హైదరాబాద్: కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగలు మరోసారి తెగబడ్డారు. సోమవారం రాత్రి ఆరో ఫేజ్‌లో ఉన్న సత్యసాయి సదన్ అపార్టుమెంట్‌లోని ఫ్లాట్ నంబర్ 202, లక్ష్మీ రెసిడెన్సీలోని 404, 401, 202 ఫ్లాట్‌ల్లో తాళాలు పగులగొట్టి దొంగతనానికి యత్నించారు. అలాగే, జగన్‌మోహన్ అపార్టుమెంట్, దివ్య ఎమరాల్డ్‌ల్లో కూడా ప్రవేశించారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లనే దొంగలు టార్గెట్ చేసుకున్నారు. బాధితులు స్థానికంగా లేనందున చోరీకి గురైన సొత్తు వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటన స్థలాలను పరిశీలించి, వివరాలు సేకరిస్తున్నారు.