ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్న కోదండరాం
- టీఆర్‌ఎస్ ఎంపీ సుమన్, ఎమ్మెల్యేల మండిపాటు
- విలువైన సలహాలు, సూచనలు ఇస్తే అభ్యంతరం లేదని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం కాంగ్రెస్ కార్య కర్తగా మారి ఆ పార్టీకి మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. ఎమ్మెల్యేలు దివాకర్ రావు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చిన్నం దుర్గయ్య, రమేశ్‌తో కలసి ఆయన సోమ వారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో విలేక రులతో మాట్లాడారు. ప్రభుత్వంపై ఉద్దేశ పూర్వకంగా దాడి చేస్తూ బురద చల్లుతున్నా రని మండిపడ్డారు. భవిష్యత్‌లో కూడా ఇదే ధోరణితో కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సుమన్ హెచ్చరిం చారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు అడ్డుపడటానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిం చారు. తెలంగాణవాదిగా ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇస్తే తీసుకుంటామని, విమర్శలు చేస్తే మాత్రం సహించమన్నారు.
ఇప్పుడున్నది తెలంగాణ జేఏసీ కాదని, కోదండరాం జేఏసీ అన్నారు. కోదండ రాంను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ కపట రాజకీయం చేస్తోందన్నారు. తమది రాజకీయ వేదిక కాదంటూనే ఫిరాయింపు రాజకీయాలపై కోదండరాం ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీలో తమ బలం ఇప్పుడు 98కి చేరింద ని, తెలంగాణ సుస్థిరత కోసమే వేరే పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నామన్నారు. టీఆర్ ఎస్ అధికారంలో ఉండడం ఆయనకు ఇష్టం లేదని, మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు అడ్డం పడ్డది కోదండరాం కాదా.. అని ప్రశ్నించారు. ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే కాం గ్రెస్‌కు పుట్టగతులు ఉండవని, ఆయన కాంగ్రెస్‌ను రక్షించాలనుకుంటున్నారన్నారు. జేఏసీ కాంగ్రెస్‌కు అనుబంధ విభాగంగా మారిందని, విపక్ష నేతల నుంచి వస్తున్న మాటలే కోదండరాం నోటి వెంట వస్తున్నా యని విమర్శించారు.