'ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్లు ఇచ్చి కొంటున్నారు' | ys jaganmohan reddy takes on chandra babu | Sakshi
Sakshi News home page

'ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్లు ఇచ్చి కొంటున్నారు'

Published Sat, Apr 23 2016 12:16 PM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM

'ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్లు ఇచ్చి కొంటున్నారు' - Sakshi

'ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్లు ఇచ్చి కొంటున్నారు'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్నారని, సంతలో గొర్రెల మాదిరిగా విపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారని, ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం బరితెగించి  అవినీతి సొమ్ము, బ్లాక్ మనీతో విపక్ష ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్న వ్యవహారంపై గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు అనైతిక రాజకీయ కార్యకలాపాలపై, అవినీతిపై గవర్నర్కు నివేదించారు. పార్టీ ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలతో రాజీనామాలు కోరకుండా, మంత్రి పదవులు ఇస్తామని వారికి ఆశ చూపుతున్నారని, ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలని నరసింహన్ను కోరారు. శనివారం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో కలసి వైఎస్ జగన్ రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తో సమావేశమై ఫిర్యాదు చేశారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అవినీతి, విపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్న వ్యవహారంపై వైఎస్ఆర్ సీపీ  రణభేరి మోగించిందని, ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి, ప్రధానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..
 

  • చంద్రబాబు అవినీతి సొమ్ము, బ్లాక్ మనీతో విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు
  • ఫిరాయింపులపై గవర్నర్కు ఫిర్యాదు చేశాం
  • రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై నివేదించాం
  • రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది
  • జీవో 20 పేరిట కాంట్రాక్టులకు మేలు చేస్తున్నారు
  • కాంట్రాక్టుల నుంచి డబ్బులు తీసుకుని వాళ్లకు మేలు చేస్తున్నారు
  • అన్ని రేట్లు తగ్గుతున్న సమయంలో అంచనాలను విపరీతంగా పెంచారు
  • నీటిని నిల్వచేసే సామర్థ్యం లేకపోయినా డబ్బులు గుంజుకునేందుకు పట్టిసీమ ప్రాజెక్టు కట్టారు
  • పట్టిసీమ ప్రాజెక్టు పనులను 22 శాతం ఎక్సెస్ రేటుకు కట్టబెట్టారు
  • ఇసుక మాఫీయాలో వేల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు
  • చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్, టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వాటాలు పంచుకుంటున్నారు
  • రాజధాని ప్రాంతంలో ఎన్నో అక్రమాలు జరిగాయి
  • రైతులకు అన్యాయం చేసిన విషయంపై గవర్నర్కు ఫిర్యాదు చేశాం
  • రాజధానికి సంబంధించి చంద్రబాబు తన వాళ్లకు ముందే చెప్పారు
  • వాళ్లు భూములు కొనుగోళ్లు చేసిన తర్వాతే రాజధానిని ప్రకటించారు
  • రాజధాని విషయంలో చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించారు
  • చంద్రబాబుపై వచ్చిన అన్ని అవినీతి ఆరోపణలను గవర్నర్కు నివేదించాం
  • విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవినీతిని వివరించాం
  • ఈ అవినీతి కార్యకలాపాల్లో వచ్చిన సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు 20 నుంచి 30 కోట్లు ఇస్తున్నారు
  • అంతేగాక మంత్రి పదవుల ఆశ చూపి విపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారు
  • వైఎస్ఆర్ సీపీ తరపున పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా ఎలా టీడీపీలోకి తీసుకుంటారు
  • వీరి రాజీనామాలు కోరకుండా ఎలా మంత్రి పదవులు ఇస్తామని ఆశ చూపుతారు?  ఇది జరగకుండా చూడాలని గవర్నర్ను కోరాం
  • చంద్రబాబుకు సవాల్ విసురుతున్నా.. ప్రజా స్వామ్యంపై గౌరవం ఉన్నా, మీకు సిగ్గు, శరం ఉన్నా పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు
  • అధికారం ఉంది. పోలీసులు ఉన్నారు. మీడియాలో కొన్ని పత్రికలు, ఛానెళ్లు మీకు వంతపాడుతున్నాయి
  • ప్రజలు మళ్లీ ఎవర్ని ఎన్నుకుంటారో తేల్చుకుందాం
  • అధికారం, డబ్బు, మద్దతు ఉన్న చంద్రబాబు ఆ 12 మందితో ఎందుకు రాజీనామా చేయించడం లేదు?
  • వీరితో రాజీనామా చేయిస్తే మళ్లీ గెలుస్తామనే నమ్మకం లేదు. అందుకే వారు అనర్హులు కాకుండా కాపాడుతున్నారు
  • చంద్రబాబు తీరుకు నిరసనగా ఈ రోజు సాయంత్రం కొవ్వుత్తుల ప్రదర్శన నిర్వహిస్తాం
  • ఈ నెల 25న ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేస్తాం. రాష్ట్రపతి, ప్రధాని  అపాయింట్ మెంట్ కోరాం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement