పుతిన్-నరేంద్ర మోదీ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : భారత్, రష్యాల మధ్య మరో కీలక ఒప్పందం ఖరారైంది. ఐదు బిలియన్ డాలర్ల (రూ. 40,000 కోట్లు) విలువైన ఎస్-400 ట్రయంఫ్ క్షిపుణులను రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు భారత్ అంగీకరించింది. ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య 19వ ద్వైపాక్షిక సదస్సులో ఈ ఒప్పందం ఖరారైనట్లు ఇరు దేశాల నేతలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశంలో ఎనిమిది అంశాలపై సంతకాలు చేశారు. కాగా రష్యా నుంచి ఎలాంటి ఆయుధాలు కొనుగోలు చేయకూడదన్న అమెరికా ఆంక్షలను లెక్కచేయకుండా భారత్ కొనుగోలుకే మొగ్గుచూపింది. ఈ నేపథ్యంలో భారత్‌పై అమెరికా తదుపరి ప్రకటన ఎలా ఉంటోందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. సదస్సులో భాగంగా మోదీ మాట్లాడుతూ.. భారత్ అభివృద్ధిలో రష్యా సహాకారం ఎంతో ఉందని వ్యాఖ్యానించారు. భారత్‌కు నమ్మకమైన మిత్రదేశం రష్యా అని, అంతరిక్షం, రక్షణ, వంటి అంశాల్లో రష్యా సహాకారం ఎంతో ఉందని మోదీ కోనియాడారు.
మోదీకి ఆహ్వానం...
రష్యాలోని వ్లాదివోస్లోక్ ఫోర్‌మ్‌కు ముఖ్య అతిధిగా నరేంద్ర మోదీని రావాల్సిందిగా పుతిన్ ఆహ్వానించారు. ఉగ్రవాదం, రక్షణ సహాకారం వంటి పలు కీలక అంశాలపై మోదీతో చర్చించినట్లు పుతిన్ తెలిపారు. ఇండియా ఇంధన అవసరాలను తీర్చేందుకు రష్యా ఎల్లపూడూ సిద్దంగా ఉంటుందని పుతిన్ వెల్లడించారు. భారత్‌ను రష్యాకు నమ్మమైన మిత్రదేశంగా పుతిన్ వర్ణించారు.
Comments
Please login to add a commentAdd a comment