న్యూయార్క్: కరోనా మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలం అవుతోంది. ఇక అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కరోనా బాధితులు పెరిగిపోవడంతో మిలటరీ వైద్యులు కూడా ప్రస్తుతం ఆసుపత్రుల్లో వైద్యం అందించాల్సిన పరిస్థితి వచ్చింది. 2011లో న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు చెందిన ట్విన్ టవర్స్‌పై అల్‌ఖైదా ఉగ్రవాదులు జరిపిన దాడిలో మృతుచెందిన వారి సంఖ్యను ఒక్క న్యూయార్క్‌లో కరోనా మృతుల సంఖ్య దాటిపోయింది. ఇప్పటి వరకు న్యూయార్క్ నగరంలోనే దాదాపు 1 లక్షా 50 వేల మంది కరోనా బారిన పడగా దాదాపు 6268 మంది మృతిచెందారు. 2011, సెంప్టెంబర్11 ఉగ్రదాడిలో మృతిచెందిన వారి సంఖ్య 2977 కాగా, ప్రస్తుతం అదే న్యూయార్క్ నగరంలో చోటుచేసుకున్న కరోనా మరణాలు రెట్టింపు కంటే అధికం అయ్యాయి.
'బ్రూక్లిన్ ఆసుపత్రి ప్రస్తుతం శవాల దిబ్బగా మారింది. మార్చురీలలో శవాలను పెట్టేందుకు ఖాళీ లేక ఆసుపత్రి బయటే శవాలు గుట్టలుగా పడి ఉన్నాయి. రోడ్ల పక్కనే చిన్న టెంట్లు ఏర్పాటు చేసి వాటిని మొబైల్ మార్చురీలుగా మార్చుతున్నారు' అని ఆసుపత్రి ఎదుటే నివాసముంటున్న అలిక్స్ మొంటెలీయోన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment