రక్తంతో స్నానం చేశారు? | women and men drench themselves in fake blood to protest against Spain Bulls festival | Sakshi
Sakshi News home page

రక్తంతో స్నానం చేశారు?

Published Thu, Jul 7 2016 10:45 AM | Last Updated on Mon, Sep 4 2017 4:20 AM

రక్తంతో స్నానం చేశారు?

రక్తంతో స్నానం చేశారు?

సాన్ ఫెర్మిన్: వారికి జంతువులంటే ప్రాణం. మనుషులు జంతువులను తమ వినోదం కోసం హింసించడంపై వినూత్నంగా నిరసన తెలపాలనుకున్నారు. అంతే.. అంతా ఒకచోట కూడి రక్తాన్ని తలపించే ద్రావణంతో స్నానం చేశారు.

స్పెయిన్లో ఎద్దులతో ఆడే క్రీడ 'బుల్ఫైట్' ఎంత ఫేమస్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే.. అక్కడి జంతు ప్రేమికులు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరో వారం రోజుల్లో సాన్ ఫెర్మిన్ సిటీలో బుల్ఫైట్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో పెటా, ఎనిమనేచురలిస్ట్ సంస్థలకు చెందిన జంతుప్రేమికులు ఫేక్ బ్లడ్తో స్నానం చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. సరదాల కోసం జంతువులను హింసించొద్దని వారు డిమాండ్ చేశారు. తలపై కొమ్ములను ధరించి.. నిజంగా రక్తమే అని భావించేలా ఉన్న ద్రావణంతో వారు చేపట్టిన వినూత్న నిరసన ఆలోచింపజేసింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement