అమితాబ్ బచ్చన్
అమితాబ్ బచ్చన్ ట్విట్టర్‌లో ఎంత యాక్టివ్‌గా ఉంటారో మనందరికీ తెలిసిన విషయమే. సినిమా షూటింగ్ అప్‌డేట్స్, ఫ్లాష్‌బ్యాక్ ఫొటోలు, ఫ్యామిలీ ఈవెంట్స్ విషయాలతో సహా అన్ని విషయాల్నీ అభిమానులతో షేర్ చేసుకుంటూ ట్విట్టర్‌లో చాలా చురుకుగా ఉంటారు. ఇటీవల ట్విట్టర్‌లో ఒకేరోజులో సుమారు 2 లక్షల మంది ఫాలోయర్స్ సంఖ్య తగ్గిపోవటంతో అప్‌సెట్ అయిన అమితాబ్ ట్విట్టర్‌ను వదిలేస్తున్నాను అని చమత్కరించారు.
అక్కడితో ఆగకుండా ఏకంగా ట్విట్టర్‌ను ఉద్దేశిస్తూ ఓ కవిత కుడా రాసేశారు. ఆ కవిత ముందు ట్విట్టర్‌ని ఉద్దేశిస్తూ ఓ విన్నపం కూడా వదిలారు. ‘‘అరే తమ్ముడూ లేదా అక్కయ్యా.. నువ్వే జెండరో తెలియదు అందుకే రెండిటితో సంభోదిస్తున్నాను. నేనేదో రాద్దాం అనుకుంటాను, నువ్వు దానికి రాద్ధాంతం చేస్తావు. నా 2లక్షల మంది ఫాలోయర్స్‌ను లాగేసుకున్నావు. ఇప్పుడు నా అకౌంట్‌ను కూడా లాగేసుకోవద్దు. నా పట్ల క్రూరంగా ఉండొద్దు’’ అని పేర్కొన్నారు.
ఈ విన్నపం తర్వాతి ట్వీట్‌లో కవితను పోస్ట్ చేశారు బిగ్ బీ. ఆయన రాసిన ‘ట్విట్టర్ కవిత’ సారాంశం ఏంటంటే... ‘‘పక్షీ... ఓ పక్షీ ఎక్కడుంది నీ ఇల్లు? తుర్రు తుర్రుమంటూ ఇక్కడికి ఎగిరి వస్తున్నావు. నిన్ను చూడాలనుకునే వారు ఇంతమంది... నీకెందుకు భయం? ఒకవేళ అలిగితే చెప్పు మాకు... మేం తిరిగిపోతాం కాసేపటువైపు సదా నీ ఆశీస్సులెప్పుడూ ఉండాలి మాపైనే నిత్యనూతనమైన మా పువ్వులనెప్పుడూ (మాటలు) కురిపిస్తాం నీపైనే ’’. అంటూ సరదాగా సాగే ఈ పద్యాన్ని అభిమానులతో పంచుకున్నారు బిగ్ బీ.
Comments
Please login to add a commentAdd a comment