రష్మికపై దిల్‌ రాజుకు కోపమొచ్చిందా! | Dil Raju fires Rashmika Mandanna from a Movie | Sakshi
Sakshi News home page

రష్మికపై దిల్‌ రాజుకు కోపమొచ్చిందా!

Published Mon, Oct 21 2019 11:10 AM | Last Updated on Mon, Oct 21 2019 11:19 AM

Dil Raju fires Rashmika Mandanna from a Movie - Sakshi

కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా ‘గీతాగోవిందం’  సినిమాతో టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఈ సినిమా సూపర్‌హిట్‌ అవ్వడంతో రష్మికకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె దేవదాస్‌, డియర్‌ కామ్రేడ్‌ వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ఆమె చేతిలో పలు తెలుగు చిత్రాలు ఉన్నాయి.

ఇప్పుడు రష్మిక గురించి టాలీవుడ్‌ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ‘గీతా గోవిందం​’ సక్సెస్‌ తర్వాత రష్మిక తన రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసిందట. ఈ క్రమంలో  నాగా చైతన్య హీరోగా తాను నిర్మించబోతున్న చిత్రంలో రష్మికను హీరోయిన్‌గా ఖరారు చేయాలని దిల్‌ రాజు భావించారట. అయితే, ఆమె భారీ మొత్తంలో డిమాండ్‌ చేయడంతో బిత్తరపోకయిన దిల్‌రాజు.. అంతమొత్తంలో ఇవ్వడం కుదరదంటూ తేల్చి చెప్పారట. దీంతో ఆమె ఈ ఆఫర్‌ను వదులుకున్నారని టాక్‌.

రెమ్యూనరేషన్‌ కారణంగా తన సినిమా నుంచి రష్మిక తప్పుకోవడం దిల్‌ రాజుకు కోపం తెప్పించిందని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో కొత్త దర్శకుడు శశి తీయబోయే చిత్రంలోనూ రష్మికను తీసేసి.. మరో హీరోయిన్‌ను పెట్టుకోవాలని ఆయన నిర్ణయించారని ఆ వర్గాలను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. ‘నూతన దర్శకుడు శశి డైరెక్షన్‌లో దిల్‌రాజు ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో లీడ్‌ రోల్‌ కోసం రష్మికను అనుకున్నారు. దర్శకుడు ఇప్పటికే రెండుసార్లు రష్మికకు కథ వినిపించారు. అయితే, మరోసారి కథ వినాలని ఆమె కోరింది. ఈ క్రమంలో ఆమెను తీసుకోకూడదని దిల్‌ రాజు నిర్ణయించారు’ ఆ వర్గాలు చెప్పుకొచ్చాయి.

రష్మిక తన రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచడంతో పలు ఆఫర్లు వదులుకోవాల్సి వచ్చిందని ప్రస్తుతం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. నాని హీరోగా తెరకెక్కిన తెలుగు సూపర్‌హిట్‌ ‘జెర్సీ’ని హిందీలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో షాహిద్‌ కపూర్ సరసన రష్మికకు చాన్స్‌ వచ్చినా... ఆమె రెమ్యూనరేషన్‌తో షాక్‌ తిన్న నిర్మాతలు మరో హీరోయిన్‌ వెతుక్కొనే పనిలో పడ్డారని కథనాలు వస్తున్నాయి. ఏదీఏమైనా.. ‘గీతాగోవిందం’ తర్వాత రష్మికకు సరైన హిట్‌ లేదు. ఆమె నటించిన దేవదాస్‌, డియక్‌ కామ్రేడ్‌ చిత్రాలు అంతగా ప్రేక్షకులకు ఎక్కలేదు. ఈ నేపథ్యంలో మరో సూపర్‌ హిట్‌ వస్తే తప్ప రష్మికకే ఇండస్ట్రీలో క్రేజ్‌ పెరగడం కష్టమేనని సినీ జనాలు అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement