షారుక్‌ని పెళ్లిచేసుకోవాలని ఉంది: డైరెక్టర్
ముంబై: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ బాద్షా, సూపర్ స్టార్ షారుక్ ఖాన్‌ని వివాహం చేసుకుంటానని చెప్పడంతో అందరూ ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. ముంబైలో ఇటీవల జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో దర్శకనిర్మాత కరణ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ విలేకరి ప్రశ్నకు బదులిస్తూ.. నేను మాత్రం హీరో షారుక్ ఖాన్‌ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అందుకు కారణం చెప్పుకొచ్చాడు. స్టార్ హీరో షారుక్ ఖాన్ బంగ్లా అంటే తనకెంతో ఇష్టమని, బంగ్లా సొంతం చేసుకోవాలంటే ఆయనను పెళ్లి చేసుకోక తప్పదు కదా అంటూ చమత్కరించాడు కరణ్.
బాలీవుడ్లో తనకు గాడ్ ఫాదర్ షారుఖ్ అని కరణ్ తరచుగా చెబుతుంటాడు. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్. మరోవైపు నటి కాజోల్ తో 25 ఏళ్ల స్నేహానికి కరణ్ గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో పాటు ఓ స్టార్ హీరోయిన్ ని చంపేయాలని ఉందని.. అందుకు కారణం మాత్రం చెప్పాలని లేదని మరో ప్రశ్నకు కరణ్ ఇలా బదులిచ్చాడు. షారుక్ తో ఎక్కువగా సన్నిహితంగా ఉంటాడని, కరణ్ తేడా అంటూ గతంలో ఓ టీవీ షో లో నేరుగా కొందరు ప్రశ్నలు అడిగిన సందర్భాలున్నాయి.